ఏ హాస్పిటల్‌కు వెళ్లినా అదే మాట.. నాకు పరిస్థితి అర్థమైపోయింది.. కన్నీటి గాథలు చెప్పిన రానా

రానా ఆరోగ్యం గురించి ఈ మధ్య మళ్లీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. సమంత నిర్వహిస్తోన్న సామ్ జామ్ టాక్ షోకు సంబంధించిన ప్రోమో మూడ్రోజుల క్రితం బయటకు వచ్చింది. అందులో రానా తన ఆరోగ్య సమస్యలపై నోరు విప్పాడు. అయితే అందులో తన ఆరోగ్యం, తనకున్న సమస్యల గురించి చెప్పి అందర్నీ ఏడిపించేశాడు. అయితే ఇప్పుడు పూర్తి ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. అందులో తన ఆరోగ్య సమస్యల గురించి క్లుప్తంగా వివరించాడు.

అరణ్య టైంలో..

అరణ్య టైంలో..

థాయిలాండ్‌లో ‘అరణ్య' షూటింగ్ కోసం రానా కళ్లకు డిఫరెంట్ లెన్స్ వాడాలని దర్శకుడు ప్రభు సూచించాడట. కానీ, ఆ లెన్స్ రానా కళ్లకు పెట్టడానికి కుదరదు. అందుకుని కళ్లకు ఒక చిన్న సర్జరీ చేసిన తరవాత లెన్స్ ఫిట్ చేయాల్సి వచ్చిందట.. ఈ సర్జరీ చేయించుకుని ఒక 10 రోజులు విరామం తరవాత రానా షూటింగ్‌కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారట. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ముందుగా బీపీ చూడటంతో అందరూ షాక్ అయ్యారట.

 పరిస్థితి అర్థమైంది..

పరిస్థితి అర్థమైంది..

అలా ఎన్ని హాస్పిటల్‌లో చూపించిన బీపీని చూసిన డాక్టర్స్ షాక్ అయ్యారట. మీరు బాగానే ఉన్నారా? అని అందరూ అదే మాట అన్నారట. మొత్తం మీద డాక్టర్లు అన్ని టెస్టులూ చేసి రానాకు బీపీ 220/192 ఉందని, ఒక మనిషికి ఉండాల్సిన బీపీ కన్నా రెండు రెట్లు అధికంగా ఉందని అన్నారట. ఇక పరిస్థితి అర్థమై సీరియస్ అయ్యేలా ఉందని తండ్రి సురేష్ బాబుతో కలిసి అమెరికా వెళ్లిపోయాడట.

అవయవాలు దెబ్బతిన్నాయి..

అవయవాలు దెబ్బతిన్నాయి..

అమెరికాలో మేయో క్లినిక్ అని ఉందట. ప్రపంచంలో ఎక్కడా మన ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోతే అక్కడ దొరుకుతాయని రానా అన్నాడు. అక్కడ డాక్టర్ శాంతి స్వరూప్ బేగే అనే ఓ డాక్టర్ తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ఆయన తన దగ్గరకు వచ్చి.. నీకు పుట్టికతోనే అత్యధిక రక్తపోటు ఉంది.. కానీ, ఎవ్వరూ దాన్ని గుర్తించలేకపోయారు అని చెప్పాడట. దాని వల్ల శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయని షాకింగ్ న్యూస్ చెప్పాడట.

Recommended Video

Gatham Director Kiran Reddy About OTT || OTT ద్వారానే మూవీ అందర్నీ రీచ్ అయ్యింది !!
30 శాతం చనిపోయే..

30 శాతం చనిపోయే..


దాని వల్ల గుండె చుట్టూ కాల్షియం పేరుకుపోయింది చెప్పుకొచ్చారు. అలాగే కిడ్నీలు పాడైపోయాయి అని చెప్పారు. ఇప్పటికిప్పుడే శస్త్రచికిత్స చేసుకోకపోతే 70 గుండెపోటు వచ్చే అవకాశం, 30 శాతం చనిపోయే అవకాశం ఉందని అన్నారు. ఆరు నెలల్లో ఇది జరగొచ్చు అన్నారంటూ రానా తన సమస్యల గురించి బయటకు చెప్పేశాడు. ఆల్కహాల్, సిగరెట్, ఉప్పు, మాంసం వీటన్నింటినీ మానేయాలని చెప్పడంతో... చాలా తక్కువ ఆహారం తీసుకోవాలన్నారని..అలా ఒక్క రోజులో అలవాట్లన్నీ మార్చుకున్నానని రానా తన కన్నీటి వ్యథను వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X