»   »  'బాహుబలి 2' ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏంటి?

'బాహుబలి 2' ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బాహుబలి'లో భళ్లాలదేవునిగా ప్రతాపం చూపించిన రానా ఆదివారం బీబీసీ రేడియోలో ప్రేక్షకుల్ని పలకరించాడు. మీరూ రానా ఏం మాట్లాడారో ఇక్కడ చూడండి.


రానా మాట్లాడుతూ ''సినిమాలో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. దీనికి కారణం రాజమౌళీయే. ఆయన నా పాత్రను ఎన్నో జాగ్రత్తలతో తీర్చిదిద్దారు. నా పాత్రే కాదు అన్ని పాత్రలూ అద్భుతంగా వచ్చాయి. సినిమా కోసం ప్రభాస్‌, నేను చాలా కష్టపడ్డాం. ఇప్పుడు సినిమా సాధించిన విజయంతో దాన్ని మరచిపోయాం'' అన్నాడు.


 Rana about his latest Baahubali

అలాగే... ''చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరగడం వల్ల వాటి గురించి నాకు చాలా విషయాలు అప్పటినుంచే ఒంటబట్టాయి. ఇప్పుడు నటుణ్ని అయ్యాను. తర్వాత నిర్మాతను కావొచ్చు.. దర్శకుడిగానూ మారొచ్చు'' అన్నాడు రానా.


‘బాహుబలి' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తా చాటుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా సత్తా చాటింది.


ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' పికె రికార్డును బద్దలు కొట్టింది.


‘బాహుబలి' సినిమా అమెరికా బాక్సాపీసు వద్ద తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే మున్ముందు ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
Rana who is roaming around the country to promote his upcoming action fantasy film 'Baahubali' has given an interview to the reputed BBC (British Broadcasting Corporation) news channel. The interview was aired on the Asian category of BBC on yesterday night.
Please Wait while comments are loading...