వర్మ ఎంతో సాయం చేశాడంటున్న తెలుగు హీరో

By Srikanya

ఆ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మ ఎంతో సాయం చేశాడు అంటున్నారు దగ్గుపాటి రాణా. అలాగే వర్మ కాకపోతే అంతటి హేమాహేమాలతో పోటాపోటీగా నటించటం కష్టమంటున్నాడు ఆయన. రామ్‌గోపాల్‌ వర్మ తాజా చిత్రం 'డిపార్ట్‌మెంట్‌'లో నటించే అవకాశాన్ని రాణా అందుకొన్నారు. ఇందులో అమితాబ్‌, సంజయ్‌దత్‌, రాణా కీలక పాత్రలు పోషించారు. పోలీసు అధికారి పాత్రలో రాణా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే ..ఒక వైపు అమితాబ్‌ బచ్చన్‌. మరో వైపు సంజయ్‌దత్‌. వాళ్లిద్దరితో కలిసి కెమెరా ముందు నటించడమంటే మాటలు కాదు. ఒక సవాల్‌గా స్వీకరించి పనిచేశాను. నేను పుట్టకముందు నుంచే అమితాబ్‌బచ్చన్‌ నటిస్తున్నారు. సంజయ్‌దత్‌ 'రాకీ' కూడా నేను పుట్టే ముందే విడుదలైంది. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్లతో కలిసి నటించాలన్నప్పుడు నన్ను మానసికంగా సిద్ధం చేశారు వర్మ అని చెప్పారు.

అండరగ్రౌండ్ వరల్డ్ ని ఓ డాన్ రన్ చేస్తూంటాడు. అయితే పోలీస్ వ్యవస్ధ డాన్ మాత్రం డిపార్డ్ మెంట్..అంటూ తన కొత్త చిత్రానికి డిపార్టమెంట్ అనే పేరు ఎందుకు పెట్టానో రామ్ గోపాల్ వర్మ వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలను కూడా దయానాయక్, విజయ్ సలార్కర్, ప్రదీప్ శర్మ, సచిన్ వేజి ల నిజ జీవితాలనుంచి ప్రేరణ పొందిన కథతో రూపొందించనున్నారు.

వీరు రకరకాలుగా అండర్ వరల్డ్ డాన్ లను ఎదుర్కొంటారు. అయితే వీరి మధ్య రకరకాల ఇగోలు,సమస్యలు ఉంటాయి. అవి డిపార్టమెంట్ లో పనిచేసే మిగతా వారిపై పడతాయి. వీటిని సమన్వయపరుస్తూ సిటీని ప్రశాంతంగా ఉంచటానికి అమితాబ్ పాత్ర కృషి చేస్తూంటుంది. పూర్తి స్ధాయి యాక్షన్ పేకెడ్ గా రూపొందే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది..అంతకు మించి ఈ చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించలేనంటున్నారు వర్మ.

ఇక 'దమ్‌ మారో దమ్‌'తో హిందీలోకి అడుగుపెట్టిన రాణా ఆ చిత్రం ప్లాప్ కావటంతో డీలా పడి ఈ డిపార్టమెంట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం విడుదల కాకముందే వర్మ తన తదుపరి చిత్రాలు అందం,మరో ధ్రిల్లర్ లోనూ రాణాని బుక్ చేసి బాలీవుడ్ దృష్టి పడేలా చేసారు. అలాగే ఈ చిత్రానికి సంతకం చేసిన రోజు నుంచి నాకు వర్మ ప్రతి విషయాన్నీ విడమరిచి చెబుతూ వస్తున్నారు. ఆయన ఇటీవల ఎక్కువ సమయం తీసుకొని తెరకెక్కించిన చిత్రం ఇదే అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X