»   » 'బాహుబలి' లో కవచాల గురించి రానా

'బాహుబలి' లో కవచాల గురించి రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : '' రాజమౌళి ఈ సినిమాను చరిత్రలా తెరకెక్కిస్తున్నారు. పాత్రల రూపకల్పన, చిత్రణ విషయంలో చాలా పక్కాగా ఆలోచిస్తున్నారాయన. మా పాత్ర స్వభావాలకు తగ్గట్టుగా శరీర కవచాలను సిద్ధం చేశారు. నా కవచం మీద సింహం బొమ్మ ఉంటుంది. ప్రభాస్‌ కవచం మీద గుర్రం బొమ్మ ఉంటుంది. ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉండకపోయినా భారతీయ సినిమా అభివృద్ధికి పనికొచ్చేలా, పరిశ్రమ ఒక అడుగు ముందుకేసేలా ఉంటాయి'' అన్నారు దగ్గుపాటి రానా.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంలో భళ్లాలదేవుడి పాత్రలో నటిస్తున్నాడు రానా. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా రానా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే... ఒక సినిమా కోసం నటీనటులు ఏళ్ల తరబడి కాల్షీట్లు ఇస్తున్నారంటే ఆ సినిమా ఎంత గొప్పదయ్యుండాలి.. లేదంటే ఆ పాత్ర వారి మనసుకు ఎంత దగ్గరయ్యుండాలి. అచ్చంగా ఇలాంటి ఆలోచనతోనే 'బాహుబలి' కోసం మూడేళ్లు వెచ్చించాను అంటున్నాడు రానా.

ఇక ''రాజమౌళి కథ చెబుతున్నప్పుడు 'ఈ సినిమా నేను కచ్చితంగా చేయాలి' అని నిశ్చయించుకున్నాను. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందనిపించింది. విలన్ పాత్ర అని తెలిసినా.. చాలా అద్భుమైన పాత్ర అని ఒప్పుకున్నాను. దీని కోసం నా శరీర దారుఢ్యం విషయంలో మార్పులు చేసుకున్నాను. ఈ సినిమా కోసం మూడేళ్లు వెచ్చించాను అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.

Rana about his latest movie Baahubali

ఎందుకంటే ఇన్నాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నా పాత్రను అద్భుతంగా మలిచారు రాజమౌళి. యుద్ధం నేపథ్యంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది.

అంతేకాదు..కరుణ్ జోహార్ తో టై అప్ గురించి మాట్లాడుతూ.... ''సినిమా అంటే ఎంతో ప్యాషన్‌ ఉన్న వ్యక్తి కరణ్‌ జోహార్‌. ఈ చిత్రబృందంతో చేతులు కలిపితే బాగుంటుందని ఆయనకు నేనే సూచించాను. సినిమా రంగం మీద ప్రేమతోనే ఆయన మాతో కలిశారు'' అని చెప్పాడు రానా.

ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' థియేట్రికల్ ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది. తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన ట్రైలర్ కు మిలయన్ల కొద్దీ హిట్స్ వచ్చాయి. ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సినిమా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రంగా నిలిపోనుంది. అంతర్జాతీయ స్టాండర్ట్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10 సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

English summary
Daggupati Rana said that he is very much happy with Baahubali movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu