'బాహుబలి' తో మాకు గందరగోళం ఏమీ లేదు

By Srikanya

హైదరాబద్ : బాహుబలి కోసం గుర్రపు స్వారీ సాధన చేస్తున్నప్పుడు కింద పడ్డా.. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో 6-7 ఫ్రాక్చర్లు అయ్యేవని డాక్టర్‌ అన్నారు. నాకు మాత్రం చిన్న దెబ్బ తగిలింది అంతే.. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రతి విషయంలోనూ స్పష్టంగా ఉంటారు. తనకు ఏం కావాలో చెబుతారు. అందువల్ల భారీ వ్యయంతో నిర్మితమైన చిత్రమైనా మాకు గందరగోళం ఏమీ లేదు అంటున్నారు దగ్గుపాటి రానా. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రానా తాను చేస్తున్న చిత్రాలతో పాటు ఈ సంగతులు వివరించారు.

అలాగే... తన చిత్రాలు గురించి వివరిస్తూ... భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతున్న బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు చేస్తున్నా.. ఈ రెండింటిలోనూ హీరోయిన్‌ అనుష్కే.. నాకన్నా సీనియర్‌ అని చెప్పుకొచ్చారు.

ఇవి కాక అందాల రాక్షసి దర్శకుడు హను దర్శకత్వంలో హిందీ-తెలుగు చిత్రం, సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెలుగు-తమిళం ద్విభాషా చిత్రాలు చేస్తున్నా. ఇవి రెండూ మా సొంత సంస్థ సురేష్‌ ప్రొడక్షన్‌లోనివే. ఈ షూటింగ్‌లన్నీ దాదాపు ఒకే సమయంలో సాగుతాయ్‌.. తెలుగుతో పాటే మరో భాషలోనూ చిత్రం విడుదలయితే నాకు బోనస్‌.. అందుకే ఇలా చేస్తున్నా అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X