ష్.. చెప్పొద్దంటూ రానాకు బన్నీ సిగ్నల్.. ఏమై ఉంటుందని నెటిజన్ల ఆరా
అల్లు అర్జున్ కెరీర్‌లో ఆర్య, ఆర్య2 సినిమాలు ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. మొదటి చిత్రం గంగోత్రి హిట్ అయినా కూడా హీరోగా నిలబెట్టింది మాత్రం ఆర్యనే. అప్పుడే కొత్తగా వచ్చిన సుకుమార్ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఆ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించి అల్లు అర్జున్‌ను తిరుగులేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఆపై ఆర్య 2 అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పలకరించారు. ఈ మూవీ వచ్చి పదేళ్లు గడిచిన సందర్భంగా అల్లు అర్జున్ చేసిన పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆడియో సూపర్ హిట్..
ఆర్య2 సినిమా ఫలితం ఎలా ఉన్నా.. అందులోని పాటలు ప్రతీ ఒక్కరినీ అలరించాయి. ఇప్పటికీ ప్రేమికులు పాడుకునే పాటల్లో ఆర్య2 పాటలు ఉంటాయి.ఈ మూవీలో ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడెంత గుండె ఏమిటో అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం బన్నీ ఈ పాటను గుర్తు చేసుకున్నాడు.

అందరికీ థ్యాంక్స్..
ఈ పాటను గుర్తు చేస్తూ.. ఈ సంతోషాన్ని దాచుకునేందుకు నిజంగానే నా హృదయంలో చోటు సరిపోదు.. ఆర్య2లో ప్రయాణం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలను తెలిపాడు. అయితే దీనికి నవదీప్ రిప్లై ఇవ్వగా.. ఆర్య2 కు ఎలాంటి సంబంధం లేని రానా కూడా రిప్లై ఇచ్చాడు.

వైరల్‌గా మారిన ట్వీట్స్..
బన్నీ చేసిన ఈ ట్వీట్‌కు నవదీప్ స్పందిస్తూ.. అమేజింగ్ మెమోరిస్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఏ సంబంధం లేని రానా మధ్యలో ఎంటరై.. ఆ సెట్‌లో నాకు కూడా మంచి మెమోరిస్ ఉన్నాయ్.. అంటూ ట్వీట్ చేశాడు.

ష్.. చెప్పొద్దంటూ బన్నీ రియాక్షన్..
రానా అలా నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఏదో ట్వీట్ చేయగా.. దానికి బన్నీ స్పందిస్తూ.. నవ్వుతూ ఉన్న ఎమోజీలతో పాటు ష్..సీక్రెట్ చెప్పొద్దంటూ అనే నోటి మీద వేలేసుకుని ఉన్న ఎమోజీని పోస్ట్ చేశాడు. దీంతో చర్చ మొదలైంది.
Recommended Video

ఏమై ఉంటుందా? అని ఆరా
ఆర్య 2 చిత్రానికి ఏ మాత్రం సంబంధం లేని రానా స్పందించడంలో నెటిజన్లకు ఎక్కడ లేని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు రానా ఏదైనా చిలిపి పని చేశాడా? అని కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ చిదంబర రహస్యం గుట్టు విప్పేది ఎవరో చూడాలి.


Click it and Unblock the Notifications











