లీకైన ఫోటోలు : అనుష్క, రాణా రొమాన్స్!

By Bojja Kumar

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం వద్ద జరుగుంది. తాజాగా ఈ చిత్రంలో అనుష్క, రాణా మధ్య జరిగే రొమాంటిక్ సాంగ్‌లోని సన్నివేశాలకు సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు లీకయ్యాయి.

దాదాపు 15 రోజుల పాటు ఇక్కడ జరిగే షూటింగులో అనుష్క, రాణాలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొననున్నట్లు మేనేజర్ బాలరాజు తెలిపారు. ఇక్కడ షూటింగ్ నిమిత్తం ప్రత్యేకంగా సెట్లు వేసారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన వీరనారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మార్చి నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఫోటోలు, మరిన్న వివరాలు స్లైడ్ షోలో...

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

గుణశేఖర్ దర్శకత్వం

గుణశేఖర్ దర్శకత్వం


తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

అనసూయ?

అనసూయ?


ఈ చిత్రంలో అనసూయని ఓ కీలకమైన పాత్రకు తీసుకున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. రాజసం ఉట్టిపడే పాత్రలో ఆమెను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం


ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X