twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అరణ్య’ ట్విట్టర్ టాక్.. జీవించిన రానా!

    |

    రానా దగ్గుబాటి పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటాడన్న సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్టుగా తన దేహాన్ని, ఆహార్యాన్ని అన్నింటిని మార్చుకుంటాడు. అలా అరణ్య సినిమా కోసం రానా పెద్ద సాహసమే చేశాడు. అయితే రానా తన కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించాడా? లేదా? రానా చేసిన ప్రయత్నాన్ని జనాలు ఏ మేరకు తీసుకుంటున్నారన్నది చూద్దాం. ట్విట్టర్‌లో ఇప్పటికే అరణ్యపై పెద్ద చర్చ నడుస్తోంది.

    అరణ్యపై బజ్..

    అరణ్యపై బజ్..

    రానా నటించిన అరణ్య సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. టీజర్,ట్రైలర్ దగ్గరి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్యాన్ ఇండియాగా తెరకెక్కించిన ఈ మూవీ గురించి అందరూ ఎదురుచూడసాగారు. బాహుబలి తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో రానా ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చాడు.

    రివ్యూలు అలా..

    రివ్యూలు అలా..

    అయితే రానా ముందుగా చెప్పినట్టుగా మీడియాకు ప్రివ్యూలు వేయించాడు. రివ్యూలు కాస్త అటూ ఇటూగా వచ్చాయి. విమర్శకులు అరణ్యపై పెదవి విరిచారు. అయితే ట్విట్టర్‌లో మాత్రం రానాను, అరణ్యను పొగిడేస్తున్నారు. ట్విట్టర్‌లో ప్రస్తుతం అరణ్య ట్రెండ్ అవుతోంది.

    రానా జీవించేశాడు..

    రానా జీవించేశాడు..

    రానా తన పాత్రలో జీవించేశాడు.. అద్భుతంగా నటించేశాడు అని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అరణ్య సినిమాకు రానానే ప్లస్ పాయింట్, అతడి నటనే ఆకట్టుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే మిగతా సినిమా అంతా యావరేజ్ అని అంటున్నారు.

    విష్ణు విశాల్ పాత్ర..

    విష్ణు విశాల్ పాత్ర..


    ఇక విష్ణు విశాల్ పాత్రపై అందరూ పెదవి విరుస్తున్నారు. ఆయన సీన్స్ ఎందుకు వచ్చాయో.. ఎందుకు వెళ్తున్నాయో.. అసలు ఆపాత్రను మలిచిన విధానంపైనే నెటిజన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అరణ్యను ఒకసారి చూడొచ్చని అంటున్నారు.

    అవే హైలెట్..

    అవే హైలెట్..


    అరణ్య సినిమాకు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోశాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో లాజిక్ లేని సీన్స్, ఎమోషనల్‌గా కథను కనెక్ట్ చేయడంలో విఫలమైందని నెటిజన్లు కామెంట్లుపెడుతున్నారు. మొత్తానికి ఒక సారి చూడదగ్గ చిత్రమని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Recommended Video

    Rana Daggubati చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న Yasaswi Kondepudi | Sarigamapa Finale
    అదే అనుమానం..

    అదే అనుమానం..

    అసలే ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం మళ్లీ నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలున్నాయ్. ఇలాంటి సమయంలో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే కమర్షియల్‌గా అరణ్య ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    Rana Aranya Twitter Review,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X