డిపార్ట్ మెంట్ లో పోలీస్ ఆఫీసర్ గా చేరిన రాణా
'లీడర్' తర్వాత దగ్గుబాటి రాణా హిందీలో చేసిన 'దం మారో దం', తెలుగులో చేసిన 'నేను-నా రాక్షసి' రెండు సినిమాలు కూడా అపజయాల పాలయ్యాయి. ప్రస్తుతం తెలుగులో ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో జెనీలియా కాంబినేషన్లో 'నా ఇష్టం' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే నలభై ఐదు రోజుల పాటు ఈ సినిమా మలేసియాలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. ఇదిలా ఉంచితే, తాజాగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందుతున్న 'డిపార్ట్ మెంట్' హిందీ సినిమాలో నటించే అవకాశం రాణాకు వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం తను ముంబైలో వున్నాడు. నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగు కోసం అక్కడ ఉంటాడు. ఇందులో తను దక్షిణాదికి చెందిన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. 'తన పర్శనాలిటీని బట్టి చూస్తే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో రాణా స్టన్నింగ్ గా ఉంటాడు' అంటూ రామ్ చరణ్ తాజాగా, తన మిత్రుడు రాణాకు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











