'రెడ్డప్ప 'గా దగ్గుపాటి రానా
'గమ్యం", 'వేదం"లతో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తాజాగా రానా తో కృష్ణం వందే జగద్గురుమ్ అనే చిత్రం డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానా పోషించే పాత్ర పేరు రెడ్డప్ప అని తెలుస్తోంది.డిసెంబర్ 14న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అనూష్క ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది.ఇక ఈ చిత్రం పక్కా మాస్ సినిమా అని,రానా క్యారెక్టర్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని వినికిడి. మైనింగ్ మాఫియా నేపధ్యంలో ఈ చిత్రం కథను రూపొందించారని ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ చిత్రాన్ని క్రిష్ తానే స్వయంగా నిర్మించడం విశేషం. కాగా నిర్మాతగా క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబా వ్యవహరిస్తారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందనుంది.
రానా ప్రస్తుతం తెలుగులో 'నాయిష్టం", హిందీలో 'డిపార్ట్‌మెంట్" చిత్రాలలో నటిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఈ చిత్రం తర్వాత వైజయంతి బ్యానర్‌లో మహేష్‌బాబు హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక రానా ఈ చిత్రం స్క్రిప్టుని రీసెంట్ గా ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంతో తాను మాస్ హీరోగా నిలబడాలని భావిస్తున్నారు. క్రిష్ సైతం మెయిన్ స్ట్రీన్ దర్సకుడుగా ఈ చిత్రంతో ఇండస్ట్రీలో స్దానం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. మాస్ కథనే కొత్తగా ప్రెజెంట్ చేస్తారని, అయితే క్యారెక్టరైజేషన్ ఓరియంటేషన్ తో కథనం నడుస్తుందని, క్రిష్ తన ప్రయోగశీలత ఈ చిత్రంలోనూ కొనసాగిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











