'రాయల్ స్టాగ్' అంబాసిడర్ గా తెలుగు హీరో
తెలుగులో ఇప్పుడు ప్రతీ హీరో తలో బ్రాండ్ కు అంబాసిడర్ గా మారిపోతున్నాడు. తాజాగా దగ్గుపాటి రాణా రాయల్ స్టాగ్ బ్రాండ్ కు అంబాసిడర్ గా సైన్ చేసారు. త్వరలోనే ఈ కంపెనీ వారు టీవి కోసం యాడ్స్ షూటింగ్ పెట్టుకుంటున్నారు. రాణాని తమ బ్రాండ్ కు తీసుకోవటం వల్ల సౌత్,నార్త్ రెండు చోట్లా మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే రాణా ప్రస్తుతం తెలుగులో నా ఇష్టం చిత్రం చేస్తున్నారు. అలాగే తమిళంలో మరో చిత్రం కమిటయ్యారు. వీటితో పాటు హిందిలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ చిత్రం చేస్తున్నారు. ఇలా సౌత్,నార్త్ ఒకేసారి కవర్ చేస్తూండటంతో అతన్ని తమ బ్రాండ్ కి తీసుకుంటే ఒకే హీరోతో అన్ని చోట్లా కవర్ చేసినట్లు ఉంటుందని భావిస్తున్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో రూపొందుతున్న డిపార్టమెంట్ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ కావటంతో అంతటా ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ లుక్ కోసం రాణా చాలా బాగా కష్టపడ్డారని చెప్తున్నారు. అండరగ్రౌండ్ వరల్డ్ ని ఓ డాన్ రన్ చేస్తూంటాడు. అయితే పోలీస్ వ్యవస్ధ డాన్ మాత్రం డిపార్డ్ మెంట్..అంటూ తన కొత్త చిత్రానికి డిపార్టమెంట్ అనే పేరు ఎందుకు పెట్టానో రామ్ గోపాల్ వర్మ వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలను కూడా దయానాయక్, విజయ్ సలార్కర్, ప్రదీప్ శర్మ, సచిన్ వేజి ల నిజ జీవితాలనుంచి ప్రేరణ పొందిన కథతో రూపొందించనున్నారు.
మరో ప్రక్క రాణా .. 'నా ఇష్టం' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. అందాల హాసిని జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నా ఇష్టం'. జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఇటీవల రాణా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మించిన "నేను- నా రాక్షసి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదీకాక రాణా ఇంకా తనను తాను ఒక పక్కా కమర్షియల్ మాస్ హీరోగా నిరూపించుకోవలసి ఉంది.


Click it and Unblock the Notifications











