»   »  ఇదే చివరి బర్త్ డే కావాలని కోరుకుంటున్న రానా!

ఇదే చివరి బర్త్ డే కావాలని కోరుకుంటున్న రానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి పుట్టినరోజు నేడు. 1984 డిసెంబర్ 14న జన్మించిన రానా 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. బాహుబలి సినిమా విడుదలకు ముందు రానా సాధారణ స్టార్. కానీ ఆ సినిమా విడుదల తర్వాత భళ్లాల దేవగా దేశ వ్యాప్తంగా పాపులర్ స్టార్ అయ్యాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...బాహుబలి సెట్స్ మీద రానాకు ఇది 3వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత శోభుయార్లగడ్డ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘బాహుబలి సినిమాకు మాతో కలిసి పని చేస్తూ రానా 3వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ విషెస్ తెలియజేసారు. దీనికి రానా రిప్లై ఇస్తూ... ‘థాంక్యూ వెరీ మచ్. కానీ ఈ సెట్లో నాకు ఇదే లాస్ట్ బర్త్ డే కావాలి అని కోరుకుంటున్నాను' పేర్కొన్నారు రానా.

Rana Believes This Should Be His Last Birthday

అలా వ్యాఖ్యానించడం ద్వారా ‘బాహుబలి-2' షూటింగ్ వచ్చే ఏడాది తన బర్త్ డేకు ముందే పూర్తి కావాలని ఆకాంక్షించారు. బాహుబలి సినిమా కోసం రానా చాలా కష్టపడుతున్నాడు. హీరో ప్రభాస్ తో సమానంగా భారీ కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రానా కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు.

లీడ‌ర్ సినిమాతో క‌థానాయ‌కుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన రానా...తొలి చిత్రంతోనే త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు రానా. ఆత‌ర్వాత ద‌మ్ మారో ధ‌మ్, డిపార్టెమెంట్ త‌దిత‌ర హిందీ చిత్రాల్లో న‌టించి బాలీవుడ్ లో సైతం త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఆత‌ర్వాత తెలుగులో నా ఇష్టం, క్రిష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ చిత్రాల్లో న‌టించినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం ఆశించిన స్ధాయిలో రాలేదు. బిగ్ బ్రేక్ కోసం ఎద‌రుచూస్తున్న స‌మ‌యంలో వ‌చ్చిందే బాహుబ‌లి.

English summary
"This is the 3rd birthday of Rana working with us on Baahubali. Wishing him many more happy birthdays with us," wished Shobhu Yarlagadda, one of the producers of Baahubali. In reply, Rana said, "Thank you very much, but I think the birthdays on this set should stop. What say??"
Please Wait while comments are loading...