‘ఢీ’ కొనబోతున్న బిపాసా - రాణా?
'దమ్ మారో దమ్" సినిమాలో జంటగా నటించి హాట్ హాట్ రొమాన్స్ పండించారు బాలీవుడ్ సెక్సీ క్వీన్ బిపాషా బసు, టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో రాణా దగ్గుబాటి. ఈ సినిమా పెద్దగా హిట్ సాధించక పోయినా....రాణాకు మాత్రం మంచి పేరే తెచ్చి పెట్టింది. దీంతో పలు బాలీవుడ్ అవకాశాలు రాణాను వెతుక్కుంటూ వచ్చాయి. తన మాజీ లవర్ జాన్ అబ్రహంతో విడి పోయిన బిప్స్ బాగా కండపట్టి దిట్టంగా ఉన్న రాణాపై మనసు పారేసుకుందనే వార్తలు కూడా వినిపించాయి.
ఆ విషయాలు పక్కన పెడితే.... ప్రస్తుత్రం ఈ ఇద్దరు ఢీ కొట్టుకోబోతున్నారని తెలుస్తూంది. ప్రస్తుతం రాణా 'డిపార్ట్ మెంట్" చిత్రంలో నటిస్తుండగా, బిపాస బసు 'జోడీ బ్రేకర్" చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరు తమ సినిమాలతో బాక్సాఫీసు వద్ద 'ఢీ" కొనబోతున్నారనే ప్రచారం బాలీవుడ్లో సాగుతోంది.
జోడీ బ్రేకర్ చిత్రంలో బిపాషా మాధవన్‌తో కలిసి నటిస్తోంది. డిపార్ట్‌మెంట్ చిత్రంలో అమితాబ్, సంజయ్ దత్ లాంటి పెద్ద స్టార్స్ నటిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాల్లో ఎవరి చిత్రం విజయం సాధిస్తుందో? గెలుపు ఎవరిదో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











