»   » తాతయ్య ఒళ్లో.. రానా.. చైతూ ( అరుదైన ఫొటో)

తాతయ్య ఒళ్లో.. రానా.. చైతూ ( అరుదైన ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని నాగచైతన్యకు ఆయన బావమరిదైన రానా దగ్గుబాటి ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'లవ్యూ ద మోస్ట్‌.. చై' అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా బాల్యంలో తాతయ్య దగ్గుపాటి రామానాయుడి ఒడిలో రానా, నాగచైతన్యలు కూర్చొన్న ఓ ఫొటోను పోస్ట్‌ చేసి... చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నాగచైతన్య సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

సినీ ప్రముఖులు వెంకటేశ్‌, కోన వెంకట్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, కృతి సనన్‌, విక్రమ్‌ ప్రభు, విజయ్‌కుమార్‌, అలీ, తాగుబోతు రమేశ్‌ తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Rana, Chaitu with their Grandfather

మరో ప్రక్క నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' పుట్టిన రోజు టీజర్‌ ని వదిలారు..

ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ప్రత్యేక టీజర్‌ను నవంబర్‌ 23న అంటే ఈ రోజున నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.

నాగచైతన్య మాట్లాడుతూ '' గౌతమ్‌ మేనన్‌ది ఓ విభిన్నమైన శైలి. 'సాహసం..' సినిమా ఆయన తరహాలోనే సాగిపోతుంది. రెహమాన్‌ మరోసారి నా చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా ఉంది. సినిమా దాదాపుగా పూర్తయింది'' అన్నాడు.

అలాగే...గౌతమ్ మీనన్ సినిమాలు చూస్తూ ఆయన సినిమాల్లో హీరోను కావాలనుకున్నాను. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తుందా అనుకుంటున్న సమయంలో 2009లో వచ్చిన ఏమాయ చేసావే చిత్రంతో నా కల నెరవేరింది. గౌతమ్‌మీనన్‌తో సినిమా అన్నప్పుడు నమ్మలేకపోయాను. అలాంటి దర్శకుడితో మరోసారి పనిచేయడం ఆనందంగా వుంది అన్నారు నాగచైతన్య.

చిత్రం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్‌ సమర్పిస్తున్నారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
In this picture Ramanaidu holding his loving grandsons Rana Daggubati and Naga Chaitanya in his both hands, Rana shared this memorable moment on twitter which is going viral.
Please Wait while comments are loading...