»   » చెంపదెబ్బ: రామ్ చరణ్, రానా ఫెయిల్ అయ్యారు!

చెంపదెబ్బ: రామ్ చరణ్, రానా ఫెయిల్ అయ్యారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హార్ట్ రోబ్ రానా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం బయట పెట్టారు. తను నటించిన బాలీవుడ్ మూవీ ‘బేబీ' చిత్రం ప్రమోషన్లో భాగంగా ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘రామ్ చరణ్, నాగ చైతన్య, అల్లు అర్జున్ నా చిన్ననాటి స్నేహితులు. చిన్న తనం నుండి రామ్ చరణ్ నాకు తెలుసు. అతను 6వ తరగతిలో ఫెయిలైన విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను కూడా 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిలైనందుకు తాత పెద్దగా ఫీలవ్వలేదు కానీ అమ్మకు మాత్రం చాలా కోపం వచ్చింది.

Rana childhood Memories

ఆ సమయంలో చిన్న గొడవ జరిగింది. నాకు కోపం వచ్చి నా చదువు నా ఇష్టం అని అరిచేసాను. అమ్మకు కోపం వచ్చి చెంపపై ఒక్కటిచ్చింది....అంటూ రానా తన చిన్ననాటి తీపి గుర్తులను నెమరు వేసుకున్నాడు. రానా చాలా ఓపెన్ మైండెడ్ కాబట్టే ఇలాంలి ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు.

‘లీడర్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన రానాకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం ఆయన నటించిన ‘బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాలు త్వరలో విడుదలకు సిద్దమవుతున్నాయి. వీటి విడుదల తర్వాత తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశతో ఉన్నాడు రానా.

English summary
“Ram Charan, Naga Chaitanya and Allu Arjun are my close friends. I failed in my tenth class and then, I moved to Hyderabad from Chennai. I knew Charan from my childhood and when I got to know that he failed in 6th class, we became close friends”. Rana said.
Please Wait while comments are loading...