బాలకృష్ణ ‘బాహుబలి’.... జూ ఎన్టీఆర్ ‘భల్లాలదేవ’
తాను బాహుబలి ప్రాజెక్టు తీస్తే ‘బాహుబలి’ పాత్రకు బాలకృష్ణను ఎంచుకుంటాను. భల్లాలదేవ పాత్రకు జూ ఎన్టీఆర్ ను ఎంచుకుంటాను అని రానా సమాధానం ఇచ్చారు
హైదరాబాద్: బాహుబలి-2 సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న రానా దగ్గుబాటి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఒక వేళ బాహుబలి సినిమాను మీరు దర్శకత్వం వహిస్తే బాహుబలి, భల్లాలదేవ పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారు? అని యాంకర్ ప్రదీప్ ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
తాను బాహుబలి ప్రాజెక్టు తీస్తే 'బాహుబలి' పాత్రకు బాలకృష్ణను ఎంచుకుంటాను. భల్లాలదేవ పాత్రకు జూ ఎన్టీఆర్ ను ఎంచుకుంటాను అని రానా సమాధానం ఇచ్చారు. శివగామి పాత్రకు రమ్యకృష్ణ తప్ప మరెవరినీ ఊహించుకోలేమని రానా తెలిపారు.

బాహుబలి బాలకృష్ణ
పౌరాణిక, జానపద చిత్రాలు బాలకృష్ణ సూపర్బ్ గా చేస్తారు. అందుకే ఆయన బాహుబలి పాత్రకు సూపర్ గా ఉంటారు అని రానా చెప్పుకొచ్చారు.

భల్లాలదేవకు ఎన్టీఆర్ బెస్ట్
ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోల్లో భల్లాలదేవ పాత్రకు జూ ఎన్టీఆర్ బెస్ట్ అని రానా కామెంట్ చేసారు.

ఊహించడమే కష్టం
బాలకృష్ణ హీరోగా, జూ ఎన్టీఆర్ విలన్ పాత్రలో.... ఇప్పటి వరకు ఇలాంటి ఊహ కూడా ఎవరికీ రాలేదు. ఒక వేళ ఇదే కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీసు వద్దలవ్వడం ఖాయం.

బాహుబలి-2
బాహుబలి-2 మూవీ తొలి మూడు రోజుల్లోనే రూ. 450 కోట్లకుపైగా వసూలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











