వర్మ 'అందం' ఫోటో షూట్ సీక్రెట్
వారం రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'అందం' చిత్రం ఫోటో షూట్ లో ఫోటో అంటూ ఒకటి బయిటకు వచ్చి మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆ ఫోటో 'అందం'సినిమాకి సంభందించింది కాదు అంటూ క్లారిఫై చేసారు రానా. ఆయన మీడియాతో మాట్లాడుతూ...రామ్‌గోపాల్ వర్మ నథాలియాతో రెండు సినిమాలు తీస్తున్నారు. అందులో అందం ఒకటి.
ఈ ఫోటో షూట్ కూడా దానికి సంబంధించినదే అనుకుంటున్నారు. కానీ కాదు. ఇది ఓ యాక్షన్ థ్రిల్లర్. సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా సమయం పడుతుంది. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ఈ స్టిల్స్ రామ్‌గోపాల్ వర్మకి బాగా నచ్చాయి. ఇక 'అందం'సినిమా విషయానికి వస్తే అది చాలా హాట్ గా ఉంటుంది అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ 'డిపార్ట్‌మెంట్'లో పోలీస్ పాత్ర పోషిస్తున్న రానా తెలుగులో నటించిన 'నా ఇష్టం' ఈ నెల 23న విడుదలవుతోంది. జెనీలియా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ద్వారా ప్రకాష్ తోలేటి అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











