గర్ల్‌ఫ్రెండ్స్‌ను అలా మేనేజ్ చేశా! మిహికాతో ఇంకా మద్దు ముచ్చట లేదు.. రానా షాకింగ్‌గా
రానా పెళ్లి విషయం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన నేపథ్యంలో లక్ష్మీ మంచు తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో ఇంటర్వ్యూ చేసింది. మిహికాతో ప్రేమలో పడటం, రొమాంటిక్ లైఫ్, ఇతర విషయాలను రానా వెల్లడించారు. మిహికాతో పెళ్లి వ్యవహారం, అలాగే గర్ల్ ఫ్రెండ్స్‌ను ఎలా కన్విన్స్ చేశారనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. రానా చెప్పిన విషయాలు ఇవే..

బ్రహ్మాచారులు మేల్కొనాల్సిందే.
రానాకు పెళ్లి కాలేదు. మా పెళ్లికి ఏం తొందరమేటి అనుకొనే వాళ్లు ఇకనైనా వాళ్ల ఆలోచనను మానుకొంటారనుకొంటా. ఇక బ్రహ్మాచారులుగా ఉందామని పట్టుకొన్న పోస్టర్లు మార్చుకోవాల్సిందే. ఏదో ఒకరోజు ఇలాంటి సందర్భం వాళ్లకు కూడా రావోచ్చు. ఎప్పుడూ, ఏ సమయంలో ఎలా కొన్ని విషయాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు అనే విషయాన్ని వాళ్లు తెలుసుకొంటారు అని రానా అన్నారు.
Recommended Video

నాకు కావాల్సిన లవ్ ఆమెలోనే..
పరిశ్రమకు ఏ మాత్రం సంబంధించని వ్యక్తిని చేసుకోవాలనే స్పష్టమైన ఆలోచన నాలో లేదు. నాకు చాలాకాలంగా పరిచయం ఉంది. అయితే ఏదో క్షణంలో మిహికాలో నాకు కావాల్సిన లవ్ దొరుకుతుందని భావించాను. అందుకే ఇంటి వాళ్లతో మాట్లాడాను. ఇంట్లో వాళ్లు ఓకే అన్నారు. మిహికాను ఒప్పించాలని అనుకొన్నాను. ఆ రోజంతా బాగా ఆలోచించాను. సాయంత్రం కలిసినప్పుడు నా ప్రపోజల్ చెప్పాను. ఆమె వెంటనే ఎస్ అన్నది. దాంతో నా లైఫ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. జీవితంలో ఏవేవో అనుకొంటాం. కానీ అవన్నీ వర్కవుట్ కావనేది మిహికాతో అఫైర్తో తేలిపోయింది.

ఫ్లయింగ్ కిసెస్.. సోషల్ డిస్టెన్స్
క్వారంటైన్‌లో ఒంటరితనం వల్ల నిర్ణయం తీసుకొన్నావా? అంటే నేను కాదనే అంటాను. అలాగే నాకో ఫ్యామిలీ కావాలనో నిర్ణయం తీసుకోలేదు. మా మధ్య ఓ అవగాహన కుదిరింది. పెళ్లికి అలా సంఘటనలు చకచకా జరిగిపోయాయి. ఇంకా చేతిలో చేయి వేసి రొమాంటిక్ లైఫ్ మొదలు కాలేదు. కేవలం ఫ్లయింగ్ కిసెస్ మాత్రమే జరుగుతున్నాయి. పెళ్లికి ఓకే చెప్పినప్పటికీ.. ప్రస్తుతం మా మధ్య సోషల్ డిస్టెన్స్ కొనసాగుతుందని చిలిపిగా ఓ ప్రశ్నకు రానా సమాధానం ఇచ్చారు.

గర్ల్‌ఫ్రెండ్స్ నుంచి పాజిటివ్ రియాక్షనే..
మిహికతో కమిట్ అయ్యేటప్పుడు గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఎలా మేనేజ్ చేశావనే ప్రశ్నకు రానా సమాధానం ఇస్తూ.. అంతా మంచి జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురుపడవు. నా విషయంలో, నేను తీసుకొన్న నిర్ణయం విషయంలో నా గర్ల్‌ఫ్రెండ్స్ సానుకూలంగానే స్పందించారు. వారి నుంచి ఎలాంటి అసంతృప్తి రాలేదు. మిహికాతో పెళ్లి గురించి నిర్ణయం తీసుకొన్నప్పుడు అందరి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది అని రానా చెప్పారు.

త్వరలోనే ఎంగేజ్‌మెంట్
మే 20వ తేదీన ఫంక్షన్ ఎంగేజ్‌మెంట్ వేడుక కాదు. అది ఉత్తరాది వాళ్లు ఎంగేజ్‌మెంట్‌కు ముందు నిర్వహించే రోకా ఫంక్షన్. అయితే కేవలం మా కుటుంబ సభ్యులం మాత్రమే హాజరయ్యాం. లాక్‌డౌన్ కారణంగా నా స్నేహితులు, దగ్గరి వాళ్లను పిలువలేకపోయాం. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ ఉంటుంది. త్వరలోనే అన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను అని లక్ష్మి మంచుతో రానా అన్నారు.


Click it and Unblock the Notifications











