For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిహికాను పెళ్లికి ఎలా ఒప్పించానంటే.. లక్ష్మి మంచు లైవ్ షోలో సీక్రెట్ విప్పిన రానా

    |

    టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రానా దగ్గుబాటి పెళ్లి వార్త వినగానే ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను నడిపే మిహికా బజాజ్‌ నా ప్రపోజల్‌ను ఒప్పుకొందని రానా ట్వీట్ చేయగానే ఆ వార్త సోషల్ మీడియాను వేడెక్కించింది. మిహికాను పెళ్లి చేసుకోవడంపై కొందరు ఆశ్చర్య వ్యక్తం చేయగా.. మరికొందరు ఎవరీమే.. రానా ప్రేమలో పడటానికి కారణమేమిటి అనే ప్రశ్నలు అనేక మందిని తొలిచాయి. ఆ విషయాలపై లక్ష్మీ మంచుతో ఇన్స్‌టాగ్రామ్ లైవ్ చాట్‌లో రానా మాట్లాడుతూ...

    బాబాయ్ కూతురు అశ్రిత క్లాస్‌మెంట్

    బాబాయ్ కూతురు అశ్రిత క్లాస్‌మెంట్

    మిహికా బజాజ్ జూబ్లిహిల్స్‌లోనే ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది. ఉత్తరాది కుటుంబం అయినప్పటికీ.. తెలుగు బాగానే మాట్లాడుతుంది. ముఖ్యంగా బాబాయ్ కూతురు ఆశ్రిత క్లాస్‌మెట్ కావడంతో చాలా రోజుల నుంచి నాకు తెలుసు. అయితే మిహికా చాలా రోజుల నుంచి తెలిసినప్పటికీ మా మధ్య లాంటి లవ్ అనే యాంగిల్ లేదు. ప్రీ లాక్‌డౌన్ ముందు ప్రేమలో పడ్డాను. అంతా మూడు రోజుల్లో మొత్తం ఆరు నిమిషాల్లో జరిగిపోయింది అని రానా తెలిపారు.

    మిహికాను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు

    మిహికాను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు

    మిహికాను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే ఆమె నా ఫ్యామిలీతో ఎక్కువగా అనుబంధం ఉంది. అలాగే బాలీవుడ్‌లో నా సర్కిల్‌లో కూడా బాగా తెలుసు. అలా మిహికా గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆమె నవ్వే తీరు, మాట్లాడే విధానం అంతా నాకు సరిగ్గా సరిపోతుందని భావించాను. అంతా సవ్యంగా అనిపించింది. అందుకే అలా నా జీవితంలో మిహికా ప్రవేశించింది.

    నా ప్రపోజల్‌కు ముందు

    నా ప్రపోజల్‌కు ముందు

    ప్రపొజల్‌కు ముందు చాలారోజులు టెలిఫోన్‌లో మాట్లాడుకొన్నాం. వ్యక్తిగతంగా కూడా కలుసుకొన్నాం. జీవితం గురించి ఆమె చాలా చెప్పాను. వాటిని ఆమెలో పాజిటివ్ నెస్ కల్పించిందని అనుకొంటాను. ఒక్కసారి మిహికాకు ప్రపొజ్ చేయాలని అనే నిర్ణయం తీసుకోనే ముందు రోజంతా ఆలోచించాను. నాకు నేను మానసికంగా సిద్దమైన తర్వాతే ఆమెను కలిశాను. మిహికాను అడిగిన వెంటనే ఆమె ఎస్ అని చెప్పింది అని రానా అన్నారు.

    మంచి జరిగినప్పుడు ప్రశ్నలు వద్దు

    మంచి జరిగినప్పుడు ప్రశ్నలు వద్దు

    మిహికా, నాకు మధ్య ఎలా ప్రేమ పుట్టింది. ఎలా ఒప్పించావనే ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదు. నా ఫ్యామిలీ, స్నేహితులు అడినప్పుడు మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రశ్నలు అడుగవద్దు. మంచి జరిగినప్పుడు స్వాగతించాలే తప్ప.. ఎందుకు జరుగుతుందని ఆలోచించడం తప్పు అనేది నా భావన అని రానా తెలిపారు. ఒక్కటి మాత్రం నిజాయితీ చెప్పేదేమిటంటే.. అంతా మూడు రోజుల్లోనే జరిగిపోయింది అని రానా చెప్పారు.

    Sri Reddy Marriage Followed By Rana And Mihika Bajaj, Sri Reddy comments Viral
    నా పేరెంట్స్, సిస్టర్ ఫీలింగ్

    నా పేరెంట్స్, సిస్టర్ ఫీలింగ్

    మిహికాను పెళ్లి చేసుకొంటానని అమ్మ,, నాన్న, చెల్లికి చెప్పినప్పుడు షాక్‌తో కూడిన హ్యాపీనెస్‌ను వ్యక్తం చేశారు. నా సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీలైంది. అందరూ నేను ఎప్పుడు పెళ్లి చేసుకొంటానా అనే విషయం గురించి ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలోనే ఇలాంటి వార్త చెప్పినప్పుడు సంతోషంలో మునిగిపోయారు. మేము అనుకొంటున్నదే జరిగిపోయింది అంటూ ఫీలయ్యారు. మిహికా వాళ్లకు తెలుసు కాబట్టి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది అని చెప్పారు.

    English summary
    Rana Dagguabati reveals about affair with Miheeka Bajaj. He joined in Lakshmi Manchu Instagram Live show and reveals about his love and Roka functions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X