Rana weds Miheeka Bajaj: పెళ్లి వేదిక ఎక్కడ? సమయం ఎప్పుడంటే
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ రానా దగ్గుబాటి కొద్ది రోజుల్లోనే ఓ ఇంటివాడు కోబోతున్నారు. తన పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పక్కా కుటుంబ సభ్యులు పూర్తి చేస్తున్నారు. తన ప్రియురాలు మిహికా బజాజ్‌తో ఏడడుగులు నడిచేందుకు రానా సిద్దమవుతున్నారు. అయితే పెళ్లికి సంబంధించిన విషయాలను ఇరు కుటుంబాలు చాలా గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలో రానా పెళ్లికి సంబంధించిన వేదిక, సమయం, తేదీ వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనావైరస్ కారణంగా కట్టుదిట్టంగా
హైదరాబాద్‌లో కరోనావైరస్ పరిస్థితులు చాలా దారుణంగా ఉండటంతో రానా, మిహిక బజాజ్ పెళ్లికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిని ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాలని భావించారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఫలక్‌నామా ప్యాలెస్‌లో పెళ్లి వేదిక
ఇక రానా, మిహిక పెళ్లి ఆగస్టు 8వ తేదీన జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వేదిక, సమయం ఎప్పుడనే విషయంపై సినీ వర్గాలకు కన్ఫ్యూజ్‌గా మారింది. అయితే రానా పెళ్లిని హైదరాబాద్‌కు తలమానికంగా మారిన తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆగస్టు 8వ తేదీ రాత్రి 8.30 గంటలు ఈ పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు.

కోవిడ్ 19 కారణంగా పెళ్లిని నిరాడంబరంగా
రానా తన పెళ్లిపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కరోనావైరస్ కారణంగా మా పెళ్లిని ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాలని అనుకొన్నాం. అత్యంత నిరాడంబరంగా, సింపుల్, ఆనందకరమైన వేడుకగా జరిపించాలని అనుకొంటున్నాం. నా పెళ్లికి చాలా మంది స్నేహితులను ఆహ్వానించాలని అనుకొన్నాం. లాక్ డౌన్ నిబంధనల కారణంగా చాలా మందిని ఆహ్వానించలేకపోతున్నాం అని రానా అన్నారు.

నితిన్, నిఖిల్ పెళ్లిళ్లు కూడా
ఇటీవల టాలీవుడ్‌లో నిఖిల్, నితిన్ పెళ్లిళ్లు కూడా లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా అత్యంత నిరాడంబరంగా జరిగాయి. నిఖిల్ వివాహం మే 14వ తేదీన డాక్టర్ పల్లవి వర్మతో, నితిన్ వివాహం జూలై 26వ తేదీన షాలినితో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి అతి తక్కువ మంది అతిథులు హాజరవ్వడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











