»   »  'అరె బావా... గుర్రం తన్నేస్తోంది..' అని ప్రభాస్ అరిచాడు

'అరె బావా... గుర్రం తన్నేస్తోంది..' అని ప్రభాస్ అరిచాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అరె బావా... గుర్రం తన్నేస్తోంది..' అని ప్రభాస్ అరిచాడు. నాకేం అర్థం కాలేదు అంటూ రానా..బాహుబలి చేస్తున్నప్పుడు జరిగిన సంగతులు గుర్తు చేసుకుంటున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'బాహుబలి' రిలీజ్ డేట్ దగ్గర పడుతూండటంతో చిత్రం యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అందులో భాగంగా ...చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్న రానా దగ్గుపాటి...కూడా తనకు సాధ్యమైనంతంలో ఫుల్ బిజిగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఆయన మీడియాతో చిత్రం గురించి విశేషాలు పంచుకున్నాడు. ఇంతకీ ఈ గుర్రం తన్నేయటం ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రింద కథ చదవాల్సిందే.


రానా మాట్లాడుతూ... అదేంటో నేను చేసిన ప్రతి సినిమాకీ చిన్నదో, పెద్దదో దెబ్బ తగులుతుంటుంది. 'కృష్ణం వందే జగద్గురుమ్‌' 'డిపార్ట్‌మెంట్‌' చిత్రీకరణ సమయంలో గాయాలయ్యాయి. ఇక 'బాహుబలి' అయితే లెక్కేలేదు. ఫైట్‌ సీన్‌ ముందు కసరత్తు చేస్తున్నప్పుడు మోకాలికి గాయమైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా.. ఈ దెబ్బ ఎలా తగిలిందో అర్థం కాలేదు.


ప్రభాస్‌ మాత్రం 'బావా నిన్ను దరిద్రం ఛేజ్‌ చేసుకొంటూ వస్తుంది.. ఏం చేయలేం..' అనేవాడు. రాజస్థాన్‌ నుంచి రెండు గుర్రాల్ని తీసుకొచ్చారు ఆ గుర్రాల్ని చూస్తేనే భయమేసింది. ఒకటి ప్రభాస్‌, రెండోది నేనూ స్వారీ చేస్తున్నాం. చాలా వేగంగా పరిగెత్తే గుర్రాలవి. కానీ... వాటిని అదుపు చేయడం నావల్ల కావడం లేదు. నా గుర్రం ముందు పరుగెడుతోంది.


ప్రభాస్‌ గుర్రం వెనుక ఉంది. 'అరె బావా... గుర్రం తన్నేస్తోంది..' అని అరిచాడు. నాకేం అర్థం కాలేదు. నా గుర్రం పరిస్థితీ అంతే. పరిగెట్టిపరిగెట్టి సడన్‌గా బ్రేక్‌ వేసినట్టు ఆగిపోయింది. నేను ఎగిరిపడ్డా.


నన్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. 'చాలా ఎత్తునుంచి కింద పడ్డావు.. తలకు గాయం అవ్వాల్సింది. అదృష్టవంతుడివి..' అని డాక్టర్లు చెప్పేసరికి వూపిరి పీల్చుకొన్నా. నేను తిన్న తిండి, పెంచిన బాడీనే నన్ను కాపాడాయి అనుకొన్నా'' అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్.


Rana Daggubati about Baahubali and Prabhas

ఇక బాహుబలి విషయానికి వస్తే...


అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.


ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.


అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
, చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.


ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.


అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

English summary
While the much awaited Baahubali release is just round the corner, Rana Daggubati the antagonist of the film is busy promoting the movie in each and every possible manner.
Please Wait while comments are loading...