For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పుట్టినప్పటి నుంచే ఆరోగ్య సమస్యలు, చనిపోయే ఛాన్స్ ఉందన్నారు: మొదటిసారి క్లారిటీ ఇచ్చిన రానా

  |

  సినిమా ప్రపంచంలో పైకి నవ్వుతూ కనిపించే స్టార్స్ అందరు కూడా నిజానికి అలా ఉండరని కొంతమంది చేదు అనుభవాల గురించి తెలిస్తే చాలా ఈజీగా అర్ధమవుతుంది. ఇక బాహుబలి విలన్ రానా జీవితంలో కూడా కొన్ని కఠిన సమయాలు ఉన్నాయి. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా ఒక స్టోన్ లో బలంగా ఉన్నాడని చెప్పవచ్చు. అయితే ఇటీవల సామ్ జామ్ లో రానా తన జీవితంలోని కొన్ని కఠిన సమయాలు గురించి వివరణ ఇచ్చాడు.

  'Aranya' Movie Motion Poster Released
  సమంత సామ్ జామ్ లో..

  సమంత సామ్ జామ్ లో..

  సమంత అక్కినేని హోస్ట్ గా మొదటిసారి చేస్తున్న ప్రయత్నం సామ్ జామ్ షో. ఇటీవల ఆహా యాప్ లో మొదలైన ఈ షోలో మొదటి ఎపిసోడ్ లో రౌడి స్టార్ విజయ్ దేవరకొండ పాల్గొనగా ఇప్పుడు రానా దగ్గుబాటి అలాగే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ అతిధులుగా పాల్గొన్నారు. నవంబర్ 27న ఆహాలో సందడి చేయనున్న ఈ టాక్ షో ప్రోమోను విడుదల చేయగా సోషల్ మీడియాలో అది ఇప్పుడు వైరల్ గా మారింది.

  గతంలో ఎన్నో రకాల రూమర్లు

  గతంలో ఎన్నో రకాల రూమర్లు

  ఇక మొదటిసారి రానా దగ్గుబాటి తన ఆరోగ్యంపై స్పందించడం వైరల్ గా మారింది. అప్పట్లో రానా గురించి వచ్చిన రూమర్స్ అన్ని ఇన్ని కావు. కిడ్నీ సమస్య కారణంగా అమెరికా వెళ్లి ట్రెట్మెంట్ కూడా తీసుకున్నాడని అలాగే వాళ్ళ అమ్మ కిడ్నీ కూడా డొనేట్ చేసినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. పైగా రానా ఆ మధ్య సన్నబడటం కూడా రూమర్స్ కి బూస్ట్ ఇచ్చినట్టయ్యింది. ఫొటోలు కూడా చాలానే వైరల్ అయ్యాయి.

  మొదటిసారి స్పందించిన రానా

  మొదటిసారి స్పందించిన రానా

  ఇక మొదటిసారి సామ్ జామ్ షోలో రానా తన ఆరోగ్య విషయంపై అసలు క్లారిటీ ఇచ్చాడు. నిజంగా కిడ్నీ సమస్య వచ్చిందని చెప్పిన రానా అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు. రానా చెప్పిన విధానానికి అక్కడి వాళ్ళు కంటతడి పెట్టుకున్నారు. రానా జీవితంలో కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఉన్నాయా అని నెటిజన్లు ఆశ్చర్యపోతు కామెంట్స్ చేస్తున్నారు.

  చచ్చిపోయే అవకాశం ఉందని అన్నారు

  రానా మాట్లాడుతూ.. లైఫ్ వేగంగా వెళుతున్న టైమ్ లో అనుకోకుండా ఒక పాజ్ బటన్ వస్తుంది. అది నా లైఫ్ లో జరిగింది. పూట్టినప్పటి బీపీ ఉంది. అందువల్ల గుండె సమస్య కూడా వచ్చింది. స్ట్రోక్ హేమరేజ్( మెదడులో నరాలు చిట్లిపోవడం) 70 శాతం ఉండడంతో చనిపోవడానికి 30శాతం అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు.. రానా బావోద్వేగంతో వివరణ ఇచ్చారు.

  అతనే నా సూపర్ హీరో

  అతనే నా సూపర్ హీరో

  రానా అలా చెప్పగానే కొందరు ఆడియెన్స్ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక రానా గురించి మాట్లాడిన సమంత అతని ఆరోగ్యం గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడినప్పటికి ధైర్యంగా నిలబడిన వ్యక్తి రానా.. ఆ సమయంలో అతన్ని నేను దగ్గరగా చూశాను అంటూ.. అతను నా సూపర్ హీరో అని సమంత గొప్పగా చెప్పింది. ఈ ఎపిసోడ్ ఆహా యాప్ లో శుక్రవారం అందుబాటులోకు రానుంది.

  English summary
  It is known that Rana Daggubati has been busy with marriage till now. Rana, a housewife who simply married his girlfriend, came out just in case he wanted to enjoy the marriage life without going out for a few days. As usual he was busy again with his chores. Apart from that, he threw a new challenge to Prabhas and made the news viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X