మిహిక ఇంటికి మా ఇల్లు 3 కిలో మీటర్లే.. అందుకే పెళ్లికి ముందు అలా.. రానా క్రేజీగా
సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్లలో ప్రభాస్, రానా దగ్గుబాటి ముందు వరుసలో ఉంటారు. తాజాగా మిహిక బజాజ్‌తో ప్రేమలో పడిన రానా త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా తన ప్రియురాలు మిహికతో పెళ్లికి ముందు లైఫ్‌ను ఇటీవల ప్రముఖ ఆంగ్ల దిన పత్రికతో పంచుకొన్నారు. రానా చెప్పిన విషయాలు ఏమిటంటే..

ఎప్పటి నుంచో మిహికాతో నాకు పరిచయం
మిహికా బజాజ్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉండటంతో మా మధ్య అంతగా తెలియని వాతావరణం లేదు. నా కజిన్ ద్వారా మిహిక పరిచయం జరిగింది. దాంతో మా మధ్య మంచి అవగాహన ఏర్పడింది. అంతేకాకుండా మిహిక నివాసానికి మా ఇంటికి మూడు కిలో మీటర్ల దూరమే కావడంతో రెగ్యులర్‌గా కలుసుకొనే వాళ్లం అని రానా తెలిపారు.

మా ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే
ఒకరి ఇళ్లు మరొకరికి చేరువగా ఉండటంతో ఎప్పుడు కలుసుకోవాలంటే అప్పుడు కలిసే వాళ్లు. కలిసి ఎన్నో విషయాలు చర్చించుకొనే వాళ్లం. అలా ఎన్నో గంటలు మాట్లాడుకుంటూ ఉండిపోయిన రోజులు ఉన్నాయి. పరిస్థితులన్నీ కరెక్ట్‌గా జరిగిపోతుంటే మనం కొన్ని విషయాలను ప్రశ్నించకూడదు అని ఓ ప్రశ్నకు రానా సమాధానం ఇచ్చారు.

మిహికా నా జీవితంలో అడుగు పెట్టిన తర్వాత
మిహిక నా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత మాలో ఓ పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించింది. మేమిద్దరం మంచి జంట అవుతామనే నమ్మకం ఉంది. ఆమెకు ప్రేమించే మనసు ఉంది. మిహికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం నా జీవితంలో తీసుకొన్న అతి ముఖ్యమైన నిర్ణయంగా భావిస్తాను. మిహిక తోడు నాకు ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది అని రానా చెప్పారు.

ఆగస్టు 8న పెళ్లి వేడుక
రానా దగ్గుబాటి, డిజైనర్ మిహికా బజాజ్ వివాహానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానా, మిహిక పెళ్లిని ఇరు కుటుంబాలను ఆగస్టు 8వ తేదీన జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనావైరస్ పరిస్థితుల కారణంగా ఈ వివాహ వేడుకను నిరాడంబరంగా లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా జరిపించేందుకు చర్యలు తీసుకొంటున్నారని తెలిసింది.
Recommended Video

మిహికతో పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా
మిహిక నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ రానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం ఇండస్ట్రీ ఓ కుదుపుకు లోనైంది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలిసి పెళ్లి గురించి చర్చించుకొనే విధంగా మే 21న రోకా వేడుక జరిగింది. ఆ తర్వాత సానుకూల పరిస్థితుల్లో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి.


Click it and Unblock the Notifications











