twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా భార్య మిహికా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందా.. దగ్గుబాటి హీరో ఏమన్నాడంటే..

    |

    దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తరువాత నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న రానా దగ్గుబాటి హీరో కంటే హై రేంజ్ లో ఒక నటుడిగా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. కెరీర్ మొదట్లోనే విలన్ గా ట్రై చేసిన రానా పాన్ ఇండియన్ యాక్టర్స్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఒక నటీమణి వెండితెరపైకి రానున్నట్లు అనేక రకాల కథనాలు వచ్చాయి. ఆమె మరెవరో కాదు రానా సతీమణి అంటూ మరికొందరు డైరెక్ట్ గా ఫొటోలు వేసేస్తున్నారు.

     మ్యారేజ్ లైఫ్ ని ఏ మాత్రం మిస్సవ్వడం లేదు..

    మ్యారేజ్ లైఫ్ ని ఏ మాత్రం మిస్సవ్వడం లేదు..

    డేటింగ్ అనంతరం లాక్ డౌన్ లో కూల్ గా మ్యారేజ్ చేసుకున్న రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్.. ఇప్పటికే హనీమూన్ పార్ట్ 1ని పూర్తి చేశారు. ఇక షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ రానా మ్యారేజ్ లైఫ్ ని ఏ మాత్రం మిస్సవ్వడం లేదు. లాక్ డౌన్ లో వారు చాలా ఎక్కువ సమయాన్ని గడిపారు కూడా. ఈ ఏడాది ఆగస్ట్ 8న రానా, మిహీకాల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

    హీరోయిన్ గా రానా భార్య..

    హీరోయిన్ గా రానా భార్య..

    ఇక గత కొన్ని రోజులుగా మిహీకా కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు పలు మీడియాలలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆమె అందంగా ఉంటుంది కాబట్టి హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తుందని అది కూడా రానాకు జోడిగా నటించే పాత్రలో అంటూ ఇష్టం ఉన్నట్లు కథనాలు ప్రసారం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ బాగానే వైరల్ అయ్యింది.

    క్లారిటీ ఇచ్చిన రానా

    క్లారిటీ ఇచ్చిన రానా

    ఇక ఫైనల్ గా రూమర్స్ పై రానా స్పందించక తప్పలేదు. నిజం చెప్పాలి అంటే ఆమెకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు రానా. పర్సనల్ గా నటనపై కొంచెం కూడా ఆసక్తి లేదని తన పూర్తి ఆలోచన ఈవెంట్స్ మేనేజ్మెంట్, ఇతర బిజినెస్ లపై ఎక్కువగా ఉంటుందని దగ్గుబాటి హీరో రూమర్స్ కి ఒక విదంగా ఎండ్ కార్డ్ పెట్టేశాడు.

    ఆ గాసిప్స్ గురించి తనకు తెలుసు

    ఆ గాసిప్స్ గురించి తనకు తెలుసు

    ఇక మరో విషయం గురించి రానా మాట్లాడుతూ.. "నాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మిహీకాకు కూడా వాటి గురించి బాగా తెలుసు. ఆమె ముంబై, హైదరాబాద్ లలో పెరిగారు. ఏం జరుగుతుందో తెలియకుండా ఉండే అవకాశమే లేదు. ఆమెకు ప్రతిదీ తెలుసు. అయితే అలాంటి గాసిప్స్ గురించి ప్రస్తుత తరం యువత ఎక్కువగా ఆలోచిస్తారని నేను అనుకోనని రానా చెప్పాడు.

    Recommended Video

    Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
    ఆమె ఎప్పుడు పట్టించుకోలేదు

    ఆమె ఎప్పుడు పట్టించుకోలేదు

    చాలా వరకు అలాంటి రూమర్స్ గురించి ఎవరు ఆలోచించరు అంటూనే ఈ సంబంధాల గురించి కొంతమందికి నిజమని అనిపించినప్పటికీ.. మిహీకా అలాంటి గాసిప్‌ల గురించి ఎప్పుడూ బాధపడలేదని రానా అన్నాడు. మొత్తానికి ఇద్దరి మధ్యన ఒక పదునైన నమ్మకం ఉందని రానా వివరణ ఇచ్చాడు. ఇక తన ఆరోగ్యం గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చినా కూడా వాటిని మిహీకా పెద్దగా పట్టించుకోలేదని రానా తెలిపాడు.

    English summary
    It is known that Rana Daggubati has been busy with marriage till now. Rana, a housewife who simply married his girlfriend, came out just in case he wanted to enjoy the marriage life without going out for a few days. As usual he was busy again with his chores. Apart from that, he threw a new challenge to Prabhas and made the news viral on social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X