ఎన్టీఆర్ ఇంట్లో రానా పెళ్లి చూపులు.. నా జీవితంలో మరచిపోలేని రోజు, అసలేం జరిగిందంటే!
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం చుట్టూ అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని కీలక ఘట్టాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. స్వయంగా బాలయ్య తన తండ్రి పాత్రలో నటించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో జరుగుతోంది. షూటింగ్ కు సంబందించిన ఆసక్తికరమైన అంశాన్ని రానా వివరించాడు.

పెద్ద సవాల్
చిన్న నాటి నుంచి తెలుగు సినిమాపై ఎన్టీఆర్ ప్రభావం, రాజకీయాల్లో ఆయన సాధించిన విజయాల గురించి వింటూ పెరిగాను. ఆయన చరిత్రని తిరిగి ఆడియన్స్ కు చూపించే చిత్రంలో చంద్రబాబుగా నటించడం నాకు పెద్ద సవాల్ అని రానా తెలిపాడు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్రలో మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ నటిస్తోంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

చంద్రబాబు పాత్రలో
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో రానా దగ్గుబాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు పాత్ర చాలా కీలకమైనది. ఎన్టీఆర్ అల్లుడిగా, ఆయన స్థాపించిన టిడిపిలో సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. ఆ సంగతులన్నీ రానా పాత్ర ద్వారా మరోమారు మనకు తెలియబోతున్నాయి.

ఎన్టీఆర్ ఇంట్లో
కొన్ని రోజులుగా అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో రానా కూడా పాల్గొన్నాడు. ఆ ఇల్లు నందమూరి కుటుంబ సభ్యలకు తీపి గుర్తు. కాలక్రమంలో ఎన్టీఆర్ ఆ ఇంటిని అమ్మేశారు. సదరు ఇంటి ఓనర్ ఆ ఇంటిని చాలా పవిత్రంగా చూసుకునేవారట. చెప్పులు బయట విడచి లోనికి వెళ్లేవారట.

చరిత్ర సృష్టించిన
ఆ ఇంటి నుంచే ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. తొలిసారి ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు భావోద్వేగానికి గురయ్యా. ఎన్టీఆర్ నడిచినచోట, ఆయన పడక గదిలో తిరిగా. ఆ ఇంట్లో తొలిరోజు షూటింగ్ నా జీవితంలో మరచిపోలేని రోజు అని రానా తెలిపాడు.

రానాకు అక్కడేం పని
రానాకు ఎన్టీఆర్ ఇంట్లో ఏంపని అని ప్రశ్న తలెత్తగానే చంద్రబాబుని గుర్తు చేసుకుంటే సరిపోతుంది. చంద్రబాబు అప్పుడప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ ని కలుసుకున్నారు. చంద్రబాబు సమర్థత గమనించిన ఎన్టీఆర్ కి అతడిని అల్లుడిగా చేసుకోవాలనే ఆలోచన మొదలైంది.

రానాకు పెళ్లి చూపులు
రానాకి సంబందించిన సన్నివేశాలు ఎన్టీఆర్ నివాసంలో చిత్రీకరిస్తున్నారంటే పెళ్లి చూపులకు సంబందించిన సన్నివేశాలు అయి ఉంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేదా చంద్రబాబు ఎన్టీఆర్ ని కలసే సమయంలో తన సతీమణి భువనేశ్వరిని తొలిసారి చూసే సందర్భాం అయినా అయి ఉండవచ్చు. చంద్రబాబుగా రానా ఎలా మెప్పిస్తాడో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











