ఇక స్కెచ్‌లు వర్కవుట్ కావు.. ఆ విషయం లేకపోతే దొబ్బదు.. రానాకు అల్లు అర్జున్ వార్నింగ్

టాలీవుడ్ భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి మరోసారి తన అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యేందుకు సిద్ధమయ్యారు. నం 1 యారీ షోను రెండు సీజన్లపాటు అద్భుతంగా నిర్వహించిన రానా తన మూడో సీజన్‌కు తెర లేపారు. త్వరలోనే ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ప్రసారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అడిగిన ప్రశ్నలకు రానా సమాధానాలిస్తూ..

చీరకట్టు అందాలతో అనసూయ భరద్వాజ్: స్టేజీపై డాన్స్ (ఫొటోలు)

మిహికా పెళ్లి విషయం గురించి

మిహికా పెళ్లి విషయం గురించి

మిహికాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత మొదటిసారి అమ్మకు చెప్పాను. కానీ నా తల్లి అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత మా నాన్నకు చెప్పినా నమ్మలేదు. అనంతరం నాగ చైతన్యకు చెబితే లైఫ్‌లో ఇదే బెస్ట్ డిసిషన్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నా పెళ్లి వార్త చెప్పగానే నా ఫ్రెండ్స్ అందరూ షాక్ గురయ్యారు అని రానా అన్నారు.

నా 3am ఫ్రెండ్ రాంచరణ్

నా 3am ఫ్రెండ్ రాంచరణ్

నా జీవితంలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ (యారీ) అంటే రాంచరణ్, బన్నీలే. మా మధ్య చాలా విషయాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఒకరి అభిప్రాయాలను మరొకరం షేర్ చేసుకొంటాం. నా 3am స్నేహితుడు రాంచరణ్ మాత్రమే. పెళ్లికాక ముందు తెల్లవారు జామున మూడు గంటలకు కూడా పగలు మాట్లాడుకొన్నట్టు ఉండేది. పెళ్లి తర్వాత అలాంటి విషయాలే లేవు అని రాంచరణ్ చెప్పారు.

అల్లు అర్జున్ నాకు ఎక్కువగా సలహాలు

అల్లు అర్జున్ నాకు ఎక్కువగా సలహాలు

నాకు జీవితంలో ఎక్కువగా సలహాలు ఇచ్చే వారిలో రాంచరణ్ ముందుంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్ ఉంటారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌తో నాకు మంచి రిలేషన్ ఏర్పడింది. ప్రభాస్ కూడా నాకు మంచి సలహాలు ఇస్తుంటాడు అని రానా తెలిపారు.

స్కిల్ లేకపోతే దొబ్బదు అంటూ

స్కిల్ లేకపోతే దొబ్బదు అంటూ

నా కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇచ్చింది అల్లు అర్జున్ మాత్రమే. లీడర్, హిందీలో ధమ్ మారో ధమ్ సినిమా పూర్తయ్యాయి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌తో నేను నా రాక్షసి చేస్తున్నాను. ఆ సమయంలో నా గురించి చెబుతూ.. ఇప్పటి వరకు ఏదో స్కెచ్‌లు వేసుకొని వచ్చావు. ఇక నుంచి స్కిల్ లేకపోతే దొబ్బదు అంటూ అల్లు అర్జున్ అన్నాడని రానా చెప్పారు.

మార్చి 14 నుంచి నం 1 యారీ సీజన్ 3

మార్చి 14 నుంచి నం 1 యారీ సీజన్ 3

ఇదిలా ఉండగా, రానా హోస్ట్‌గా నం 1 యారీ సీజన్ 3 ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై ప్రారంభం కానున్నది. మార్చి 14వ తేదీ ఆదివారం రోజున జాతి రత్నాలు టీమ్‌తో తాజా ఎపిసోడ్ ప్రసారం కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రోమో మరింత ఆసక్తిని రేపుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X