»   » హీరో రానా రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాకవుతారు...

హీరో రానా రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాకవుతారు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అనే అంశం చాలా కీలకంగా మారింది. హీరో తీసుకునే రెమ్యూనరేషన్ బట్టే సినిమా బడ్జెట్ ఆధార పడి ఉంటుంది. హీరో స్థాయిని బట్టి, అతని సినిమాలకు అభిమానులు, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి సినిమా ఏ స్కేలులో తీయాలనే లెక్కులు వేస్తుంటారు.

బాహుబలి సినిమా తర్వాత రానాకు ఎంత పేరొచ్చిందో... తను చేసిన భల్లాలదేవ పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రానా రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిందనే ప్రచారం జరిగింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రానాకు రెమ్యూనరేషన్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. బాహుబలి తర్వాత చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనే ప్రశ్నకు రానా షాకయ్యే సమాధానం ఇచ్చాడు.

రెమ్యూనరేష గురించి పట్టించుకోను

రెమ్యూనరేష గురించి పట్టించుకోను

‘కొత్త కొత్త సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేయాలంటే నా దగ్గర పది కథలున్నాయి. కానీ నేను అలాంటి దారిలో వెళ్లాలను కోవడం లేదు..... సినిమా కథ, తన పాత్ర గురించే తప్ప రెమ్యూనరేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదు అని తెలిపారు రానా.

అలాంటివి చాలా రేర్

అలాంటివి చాలా రేర్

బాహుబలి. ఘాజీ లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ‘ఘాజీ' తీయడం పెద్ద రిస్క్‌. కొత్త సినిమా చూపించాలనే తపనతో నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడిగా నేను సపోర్టివ్వాలి. అందుకే పారితోషికం గురించి మాట్లాడలేదు అని తెలిపారు.

లాభాలు వస్తే వాటా

లాభాలు వస్తే వాటా

నేను చేసే ప్రతి సినిమాకూ రిలీజ్ తర్వాత లాభాలొస్తే వాటా తీసుకుంటాను. నేనసలు సినిమా మొదలయ్యే ముందు రెమ్యూనరేషన్ గురించే మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్‌. నిర్మాత ఆ రిస్క్‌ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఆర్టిస్టుగా ముందుకు రావాలి. ఘాజికి అడ్వాన్సేమీ తీసుకోకుండా ఐదు నెలల డేట్లిచ్చాను అని రానా తెలిపారు.

భరించలేరు, అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నా: హీరో రానా

భరించలేరు, అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నా: హీరో రానా

ప్రస్తుతం తన జీవితం ఒక క్రమపద్దతిలో సాగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం రిస్క్ అని భావిస్తున్నాను అంటూ రానా పెళ్లి గురించి చెప్పిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Rana Daggubati about remuneration. He said that he did not want his producers to risk further by paying him fat checks and for some movies, he didn’t charge a single penny. According to him, he used to take his remuneration only after the release of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu