»   » రానాపై అడల్ట్ జోక్ వేసిన హీరోయిన్ భర్త

రానాపై అడల్ట్ జోక్ వేసిన హీరోయిన్ భర్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో ఈ మధ్య అడల్ట్ కామెడీ సినిమాలు తెగ తీస్తున్న హీరోయిన్ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తెలుగు హీరో రానాపై అడల్ట్ జోక్ వేసాడు. రితేష్ దేశ్ ముఖ్ - జెనీలియాల వివాహం జరిగి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల పార్టీ జరిగింది. ఈ పార్టీకి హాజరైన సందర్భంగా రానాపై జోకు పేలిందట.

రానా వయసు 32 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా లేకుండా బ్యాచిలర్ గా లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు పెళ్లి రోజు విషెస్ తెలిపిన రానాపై రితేష్.... ‘థాంక్యూ బ్రదర్ - బ్యాచిలర్ గా నీ సబ్ మెరైన్ ని ముంచాల్సిన టైం వచ్చింది' అంటూ పంచ్ ఇచ్చాట. ఇది ఎంత పెద్ద అడల్ట్ జోకో....మీకు అర్థమయ్యే ఉంటుంది.

రితేష్ అలా ప్రత్యేకంగా ‘సబ్ మెరైన్' అని కామెంట్ చేయడం వెనక ఓ కారణం కూడా ఉంది. ఈ కాన్సెప్టుతో రానా ఓ సినిమా కమిట్ అయ్యాడు. ‘ఘాజీ' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం..... దేశంలో తొలిసారిగా సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో వస్తున్న మూవీ.

Rana Daggubati to act in India's first submarine warfare movie

1971లో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మోహరించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘజి సముద్రంలో మునిగిపోయింది. ఐతే ఇది ఎలా మునిగిపోయిందన్నది ఇప్పటికీ మిస్టరీయే. ఆ సమయంలో ఇండియా నుంచి యుద్ధానికి వెళ్లిన ఎస్21 సబ్ మెరైన్ నేవల్ ఆఫీసర్, తన బృందంతో 18 రోజుల పాటు సముద్ర గర్భంలోనే యుద్ధం చేశారు. ఈ సంఘటన ఇతి వృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు సమాచారం. దీని కోసం హైద్రాబాద్ ట్యాంక్ బండ్ లో భారీ సబ్ మెరైన్ సెట్ కూడా వేసారు. చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. చిత్ర కథను రానాకు చెప్పగానే వెంటనే ఒకే చెప్పాడట. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Tollywood actor Rana Daggubati to act in India's first submarine warfare movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu