Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అక్కినేని హీరో సినిమా కోసం రానా దగ్గుబాటి!
Recommended Video
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటులు దర్శకులుగా, గాయకులుగా, నిర్మాతలుగా మారుతున్నారు. ఇప్పుడు అదే కోవలో చేరబోతున్నాడు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు, టైగర్ సినిమాల్లో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా చిలసౌ. భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అక్కినేని సుశాంత్ హీరోగా, రుహని హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. మే 7వ తేది సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను హీరో రానా దగ్గుబాటి విడుదల చెయ్యబోతున్నాడు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమా ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా చిత్రీకరణను తక్కువ రోజుల్లోనే పూర్తిచేశారు. సుశాంత్ కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.