రానా, మిహిక పెళ్లిపై ఫ్యామిలీ క్లారిటీ.. వాయిదా వార్తలపై స్పందన
రానా దగ్గుబాటి వివాహం వాయిదా పడినట్టు వస్తున్న వార్తలపై సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 8వ తేదీన తన ప్రేయసి మిహికా బజాజ్‌తో జరిగే వాయిదా పడినట్టు రెండు రోజులుగా మీడియాలో వార్తలు రావడంతో స్పందించారు. కొద్ది రోజుల క్రితం మిహికా తమ పెళ్లికి ఒప్పుకొన్నట్టు రానా చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు కుటుంబాలు ఓ వేడుకను నిర్వహించి పెళ్లికి ముహుర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రానా పెళ్లి వాయిదాపై దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితులు స్పందిస్తూ..
Recommended Video

పెళ్లి వాయిదా పడలేదు
కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో రానా, మిహికా పెళ్లిని వాయిదా వేసినట్టు వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే రూమర్లలో వాస్తవం లేదు. పెళ్లి వాయిదా వేయలేదు. గతంలో నిర్ణయించిన ముహుర్తం ఆగస్టు 8వ తేదీనే జరుగుతుంది. ఇప్పటికే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పారు.

త్వరలోనే అధికారికంగా వివరాలు
రానా, మిహికా పెళ్లికి సంబంధించిన వివరాలను త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడిస్తారు. వేదిక, సమయం, రిసెప్షన్ లాంటి వివరాలను తెలియపరుస్తారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో పూర్తిగా తలమునకలై ఉన్నారు. అలాగే కోవిడ్ 19 నిబంధనలు అనుసరించి పెళ్లి తంతు జరుగుతుంది అని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

చాలా ఏళ్లుగా రానాతో మహికకు పరిచయం
రానా, మహిక మధ్య చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. వెంకటేష్ కూతురు అశ్రితకు మిహికాకు క్లాస్‌మేట్ అనే సంగతి తెలిసిందే. అలా పరిచయమైన మిహికాతో రానా ప్రేమలో పడ్డారు. చివరకు ఆమెను ఒప్పించడంలో రానా పూర్తిగా సఫలమయ్యారు. లాక్‌డౌన్ సమయంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే.

మిహికాను ఒప్పించడంపై రానా
మిహికాతో ప్రేమ, పెళ్లి విషయంపై రానా క్లారిటీ ఇస్తూ.. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. మిహికాతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కాకపోతే మళ్లీ రీసెంట్‌గా కనెక్ట్ అయ్యాను. నేను పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా, ఆమె ఒకే అని ఒప్పుకొన్నది. దాంతో అనుకోకుండా కొద్ది రోజుల్లోనే పెళ్లికి ముహుర్తాలు కుదిరిపోయాయి అని రానా చెప్పారు.


Click it and Unblock the Notifications











