ఘనంగా రానా, మిహికా రోకా ఫంక్షన్.. త్వరలో నిశ్చితార్థం.. రోకా ఎందుకు చేస్తారంటే..

రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ ఎంగేజ్‌మెంట్ వార్త మీడియాను, సోషల్ మీడియాను కుమ్మేసింది. ఇటీవల ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వ్యవస్థాపకురాలు, డిజైనర్ మిహికా బజాజ్‌ను పెళ్లాడబోతున్నట్టు రానా ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా వారిద్దరి ఎంగేజ్‌మెంట్ మే 20న జరుగుతుందనే వార్త విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఇంతకు రానా, మిహికా మధ్య జరిగిన ఫంక్షన్ ఏమిటంటే..

ఎంగేజ్‌మెంట్ జరగలేదు..

ఎంగేజ్‌మెంట్ జరగలేదు..

రానా ఎంగేజ్‌మెంట్ జరగలేదు అంటూ నిర్మాత సురేష్ బాబు మీడియాకు వివరణ ఇచ్చారు. దాంతో మే 20న జరిగిన ఫంక్షన్ ఏమిటనే ప్రశ్న అందరిని వెంటాడింది. మీడియానే కాకుండా సినీ ప్రముఖులను కూడా ఈ విషయంపై ఆసక్తిని కనబరిచారు. సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే జరిగిన ఫంక్షన్ ఏమిటని పలువురు ఆరా తీశారు.

నానికి రానా వివరణ

నానికి రానా వివరణ

రానా ఎంగేజ్‌మెంట్ జరిగిందా అంటూ నాని తన ఆసక్తిని ఆపుకోలేక వాట్సాప్ మెసేజ్ చేశారట. దాంతో ఎంగేజ్‌మెంట్ జరుగలేదు.. రోకా వేడుక జరిగింది అని సమాధానం ఇచ్చారు. అయితే రోకా ఫంక్షన్ ఏమిటనే ప్రశ్న నాని వెంటాడితే.. వెంటనే గూగుల్‌లో చూసి తెలుసుకొంటాను అని రానాకు బదులిచ్చాడు.

రోకా పండుగ ఎందుకంటే

రోకా పండుగ ఎందుకంటే

సంప్రదాయ మార్వాడీ ఫ్యామిలీలో రోకా ఫంక్షన్ అనేది పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాల మధ్య ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు చేసుకోవాలని చర్చించుకోవడానికి జరిగే సమావేశం. ఈ కార్యక్రమంలోనే నిశ్చితార్థం, వెడ్డింగ్, రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలనే విషయాలను ఖరారు చేస్తారు. ఇది పెళ్లి కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమంగా మర్వాడీ సమాజం ప్రారంభిస్తుందనేది తాజా సమాచారం.

అందంగా ముస్తాబైన రానా, మిహికా

అందంగా ముస్తాబైన రానా, మిహికా

రానా, మిహికా కుటుంబాల మధ్య జరిగిన రోకా కార్యక్రమం మే 20న రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 5 గంటల తర్వాత జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. రానా సంప్రదాయ ధోతి, కుర్తాలో, మిహికా పింక్ కలర్, ఎల్లో కలర్ సిల్క్ సారీలో కనిపించారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా రోకా ఫోటోలు

సోషల్ మీడియాలో వైరల్‌గా రోకా ఫోటోలు


ఇక రోకా వేడుకలో రానా, మిహికా బజాజ్ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిద్దరు అన్యోన్యంగా, సంతోషంలో మునిగి తేలుతూ దిగిన ఫోటోలు అభిమానులు ఆకట్టుకొన్నాయి. ప్రస్తుతం రానా, మిహికా మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆలరిస్తున్నది. పక్కా జోడి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Recommended Video

Sri Reddy Marriage Followed By Rana And Mihika Bajaj, Sri Reddy comments Viral
రానా పెళ్లి డిసెంబర్‌లో..

రానా పెళ్లి డిసెంబర్‌లో..

రానా ఎంగేజ్‌మెంట్, పెళ్లి వేడుకపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌లో గానీ అంతకు ముందు గానీ పెళ్లి జరిగే అవకాశం ఉంది. త్వరలోనే పెళ్లి, ఎంగేజ్‌మెంట్ తేదీలను ప్రకటిస్తాం. అప్పటి వరకు వేచి చూడండి అంటూ రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X