రానా, మిహిక కల్యాణ వైభోగం.. పెళ్లి తేదీ, వేదిక, ముహుర్తం ఎప్పుడంటే.. అదిరిపోయేలా వెడ్డింగ్ కార్డు
టాలీవుడ్‌లో యువ హీరోల పెళ్లి జోరు పెరిగింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కూడా నిబంధనలు అనుగుణంగా నిఖిల్ వివాహం చేసుకోగా, జూలై 26న జరుగబోతున్నది. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ రానా దగ్గుబాటి పెళ్లి ఇప్పటికే ఖరారు కాగా, పెళ్లి వేదిక, తేదీ అఫీషియల్‌గా ప్రకటించలేదు. అయితే తాజాగా ఇరు కుటుంబాలు రానా, మిహిక పెళ్లి తేదీలను గురువారం అధికారికంగా ప్రకటించారు. పెళ్లి వేదిక, తేదీ ఎప్పుడంటే..

ప్రేమ నుంచి పెళ్లిదాక
యువ హీరో రానాదగ్గుబాటి, డిజైనర్ మహిక బాజజ్ మధ్య చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. వెంకటేష్ కూతురు అశ్రితకు మిహికాకు క్లాస్‌మేట్ అనే సంగతి తెలిసిందే. అలా మిహికాతో రానా జరిగిన పరిచయంతో ప్రేమగా మారింది. చివరకు మిహికను పెళ్లి పీటలు ఎక్కించడానికి ఒప్పించడంలో రానా పూర్తిగా సఫలమయ్యారు. లాక్‌డౌన్ సమయంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే.

పెళ్లికి జోరుగా ఏర్పాట్లు
కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో రానా, మిహికా పెళ్లిని వాయిదా వేసినట్టు వార్తలు మీడియాలో స్వైర విహారం చేశాయి. అయితే రానా పెళ్లి వాయిదా వేసినట్టు వస్తున్న రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదు. పెళ్లి వాయిదా వేయలేదు. గతంలో నిర్ణయించిన ముహుర్తం ఆగస్టు 8వ తేదీనే జరుగుతుంది. ఇప్పటికే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పారు.

పెండ్లి పత్రికను మంచి థీమ్‌తో
రానా పెళ్లికి సంబంధించిన వివాహ పత్రికను అద్భుతంగా డిజైన్ చేశారు. పౌరాణికం థీమ్‌గా రూపొందించడంతో విశేషంగా ఆకట్టుకొంటున్నది. కృష్ణుడు, రుక్మిణిలతో పాత చిత్రంలోని సన్నివేశాన్ని తీసుకొని సూపర్‌గా డిజైన్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అధికారికంగా వివరాల వెల్లడి
రానా, మిహికా పెళ్లికి సంబంధించిన వివరాలను ఇరు కుటుంబాల సభ్యులు వెల్లడించారు. వేదిక, సమయం, రిసెప్షన్ లాంటి వివరాలను తెలియపరిచారు. ఆగస్టు 08వ తేదీ (08-08-2020)న మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో జరుగుతుంది అని వెల్లడించారు.
Recommended Video

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా
ప్రస్తుతం కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో పూర్తిగా తలమునకలై ఉన్నారు. అలాగే కోవిడ్ 19 నిబంధనలు అనుసరించి పెళ్లి తంతు జరుగుతుంది. అతికొద్ది మంది ముఖ్యులకే ఆహ్వానాలు అందించినట్టు అని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. కొవిడ్ 19 కారణంగా గట్టి భద్రత, సురక్షిత చర్యలు చేపడుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











