రానా, మిహికా పెళ్లి వాయిదా.. కారణం అదేనంటూ.. త్వరలోనే అధికారికంగా వెల్లడి
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ రానా దగ్గుబాటి తన పెళ్లి గురించి వెల్లడిస్తూ తన కాబోయే భార్య మిహికా బజాజ్ అంటూ ట్విట్టర్‌లో ప్రకటించడం వైరల్‌గా మారింది. ఆ తర్వాత తన ప్రేమ గురించి, మిహికా గురించి క్లియర్‌గా వెల్లడించారు. ఆ తర్వాత పెళ్లి కోసం ముహుర్తాలు పెట్టుకొనేందుకు ఓ వేడుకను కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసినట్టు వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

రానాకు మిహికా గ్రీన్ సిగ్నల్
తన పెళ్లి విషయంలో ఎంతో చర్చ జరుగుతున్న సమయంలో నా లవ్ ప్రపోజల్‌ను ఒకే చెప్పిందంటూ రానా ట్విట్ చేశారు. ఆ తర్వాత మహికాను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. దాంతో సినీ ప్రముఖులతోపాటు అభిమానులంతా ఆశ్చర్య పోయారు. ఆ తర్వాత రానా, మిహికాలకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి.

మే 20న రోకా ఫంక్షన్
ఇక కోవిడ్ 19 పరిస్థితుల మధ్య దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ కుటుంబాల మధ్య రోకా వేడుక జరిగింది. ఉత్తరాదికి సంబంధించిన కుటుంబాల్లో పెళ్లికి ముందు మాట ముచ్చట, పెళ్లి తేదీల ఖరారు గురించి మాట్లాడుకొనే వేడుకను రోకాగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమం మే 20 అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమ నుంచి సమంత, నాగచైతన్య మాత్రమే హాజరయ్యారు.

ఆగస్టు 8 పెళ్లికి నిర్ణయం
ఇక రానా, మిహికా బజాజ్ పెళ్లికి ఆగస్టు 8వ తేదీని ముహుర్తంగా నిర్ణయించారనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు కూడా పెళ్లిపై వివరణ ఇచ్చారు. కొవిడ్ 19 నిబంధనలకు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెళ్లి వేడుకను నిర్వహిస్తాం అని సురేష్ బాబు చెప్పారు.

కానీ రానా పెళ్లి వాయిదా వేయాలని
అయితే ప్రస్తుతం హైదరాబాద్ జంటనగరాల్లో కరోనావైరస్ ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వివాహం చేయడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందనే కారణంగా వాయిదా వేయాలనుకొంటున్నట్టు తెలిసింది.
Recommended Video

నిరాడంబరంగానా? అట్టహాసంగానా?
అయితే నిఖిల్ పెళ్లి మాదిరిగా నిరాడంబరంగా రానా, మహికా బజాజ్ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఆలస్యమైనా సరే, దగ్గుబాటి ఇంట్లో జరిగే పెళ్లిని కొద్ది మంది మధ్య కాకుండా సకుటుంబ పరివారంగా, సన్నిహితులు, స్నేహితులు మధ్య చేస్తే బాగుంటుందనే మాట కూడా వినిపిస్తున్నట్టు తెలిసింది. ఏది ఏమైనా త్వరలోనే రానా పెళ్లిపై కొద్దిరోజుల్లోనే అధికారిక ప్రకటన రానున్నదని తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











