పెళ్లి కళ వచ్చేసిందే బాలా.. మిహిక కళ్లలోకి కళ్లుపెట్టి రానా జోష్ (ఫొటోలు)
యంగ్ హీరో రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి కార్యక్రమంలో భాగంగా పలు వేడుకలకు రంగం సిద్ధమైంది. తాజాగా పెళ్లి కొడుకును చేసే కార్యక్రమంతో పెళ్లి పనుల హడావిడి మొదలైంది. రానా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి. పెళ్లి దుస్తుల్లో రానా, మిహికా మెరిసిపోతూ..

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లికి ఏర్పాట్లు
రానా, మిహిక పెళ్లి ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌కు తలమానికంగా మారిన తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లికి ముహుర్తంగా నిర్ణయించారు. ఈ పెళ్లి కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేసినట్టు సమాచారం.

గురువారం రానా, మిహికా హల్దీ వేడుక
గురువారం (ఆగస్టు 6వ తేదీన) సాయంత్రం రానాను పెళ్లి కొడుకు చేసే కార్యక్రమంతో పెళ్లి పనులు వైభవంగా కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం ఇరు కుటుంబాల సభ్యులు త్వరలోనే ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకొన్నున్నారు. పెళ్లి కొడుకును తయారుచేసే కార్యక్రమం రానా ఇంట్లో జరిగితే, మాతా కీ చౌకీ, హల్దీ వేడుకలు మిహికా నివాసంలో జరిగాయి. ఈ కార్యక్రమం కోసం సమంత, ఇతర స్నేహితులు, సన్నిహితులు రానా, మిహిక ఇంటికి వెళ్లడం కనిపించింది.

చిరునవ్వుతో జీవితం ముందుకు
హల్దీ (పసుపు) వేడుకకు సంబంధించిన ఫోటోను రానా తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. చిరునవ్వులతో జీవితం ముందుకు సాగే వేడుక మొదలైంది. థ్యాంక్స్ అంటూ రానా తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోపై సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు పెద్ద మొత్తంలో కామెంట్ చేస్తున్నారు.

పెళ్లి కళ వచ్చేసిందే బాలా అంటూ..
తన కాబోయే శ్రీమతి మిహికా బజాజ్ కళ్లలోకి తన్మయత్నంగా రానా చూస్తూ.. పెళ్లి కళ వచ్చేసిందా బాలా అనే విధంగా షేర్ చేసిన ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది. పెళ్లికి సంబంధించి సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మిలమిల మెరిసిపోతున్నారు. మిహిక పసుపు, బంగారు వర్ణంలో ఉన్న లహెంగా, చోలీలో, రానా శ్వేత వర్ణం పట్టు వస్త్రాల్లో కనిపించారు.

అమలాపాల్, ప్రియమణి గ్రీటింగ్స్
రానా, మిహిక బజాజ్‌కు అప్పుడే ప్రముఖుల విషెస్ చెప్పడం మొదలైంది. హీరోయిన్ ప్రియమణి, అమలా పాల్ తన వివాహ శుభాకాంక్షలు తెలిపారు. రానా, మిహికకు కంగ్రాట్స్ అంటూ ప్రియమణి, మీరు ఎప్పటికీ లవ్‌లోనే మునిగిపోవాలి అంటూ అమలాపాల్ ఓ మెసేజ్‌ను పంపారు.


Click it and Unblock the Notifications











