twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా, మిహికా పెళ్లిపై సురేష్ బాబు ట్విస్టు.. క్లోజ్ ఫ్రెండ్స్‌ కూడా అలా షాక్!

    |

    హైదరాబాదీ డిజైనర్ మిహికా బజాజ్‌తో అఫైర్ విషయాన్ని రానా దగ్గుబాటి బయటపెట్టడం మంగళవారం లోకల్‌తోపాటు, జాతీయ స్థాయి మీడియాలో కూడా ఓ సెన్సేషన్‌గా మారింది. ఎవరూ ఊహించని, కనీసం అది దగ్గరగా ఉండే ఫ్యామిలీలకు తెలియకుండా లవ్ మ్యాటర్ కొనసాగించి అందరికీ ఓ రకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. వారిద్దరి మధ్య రిలేషన్ ఇప్పట్లోది కాదని, చాలా ఏళ్లుగా వారిద్దరి మధ్య పరిచయం ఉందనే విషయం ఈ సందర్భంగా వెల్లడైంది.

    రానా దగ్గుబాటి లవర్ మిహికా బజాజ్ ఎవరు.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే!రానా దగ్గుబాటి లవర్ మిహికా బజాజ్ ఎవరు.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే!

    చాలా ఏళ్లుగా వారిద్దరు

    చాలా ఏళ్లుగా వారిద్దరు

    హైదరాబాదీ వెడ్డింగ్ ప్లానర్ మిహికా బజాజ్‌తో రానాబంధం గురించి తండ్రి, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో దీని గురించి మాట్లాడటం సరైన విషయం కాదు. కాకపోతే మాకు ఓ వేడుక లాంటి సందర్భం. మా కుటుంబమంతా చాలా హ్యాపీగా ఉంది. మిహికా, రానాకు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు. వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా క్లోజ్ రిలేషన్ ఉంది. అయితే వారిద్దరు సరైన నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. వారి పెళ్లి గురించి ఇప్పడే మాట్లడం సరికాదు. సరైన సమయంలో మీకు అన్ని విషయాలు వెల్లడిస్తాం అని తెలిపారు.

    డిసెంబర్ కంటే ముందే

    డిసెంబర్ కంటే ముందే

    మిహికా, రానాకు సంబంధించిన విషయంపై రానా తండ్రి ఈ విషయంపై స్పందిస్తూ.. ఈ ఏడాదిలోనే పెళ్లి చేయాలని అనుకొన్నాం. కానీ డిసెంబర్ వరకు ఈ పెళ్లిని ఆపేది లేదు. అంతకంటే ముందే పెళ్లి జరిపిస్తాం. అన్ని విషయాలు ఫైనల్ అయ్యాక మీకు అన్ని వివరాలు స్పష్టంగా తెలియజేస్తాం అని డి సురేష్ బాబు అన్నారు.

    లాక్‌డౌన్‌లో మంచి పనిపెట్టారు...

    లాక్‌డౌన్‌లో మంచి పనిపెట్టారు...

    లాక్‌డౌన్‌లో ఏమీ తోచక ఉన్న మాకు రానా, మిహిక మంచి పనిని మా ముందు ఇచ్చారు. లాక్‌డౌన్ సమయాన్ని మేము ఇలా సానుకూలంగా మలచుకొన్నాం. ఇప్పుడు పెళ్లి పనులు, ఏర్పాట్లు, వివాహానికి సంబంధించిన విషయాలను చక్కబెట్టే పనిలో బిజీగా మారిపోయాం. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వివాహం జరిపించేలా ఏర్పాట్లు చేసుకొంటున్నాం. డేట్ ఎప్పుడనేది అన్ని విషయాలు ఇరుకుటుంబాలు మాట్లాడుకొన్న తర్వాత మీడియాకువ వెల్లడిస్తాం అని సురేష్ బాబు చెప్పారు.

    Recommended Video

    Happy Birthday Sai Pallavi : Sai Pallavi Film Career Interesting Facts
    క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా షాక్

    క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా షాక్

    మిహిక బజాజ్‌తో ప్రేమ విషయాన్ని రానా సోషల్ మీడియాలో వెల్లడించడం క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా షాక్ గురిచేసింది. వారిద్దరి గురించి మాకు క్లియర్‌గా తెలిసినప్పటికీ.. ఇలాంటి వ్యవహారం వారి మధ్య జరుగుతుందనట్టు ఎక్కడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియాలో చూసి షాక్ అవ్వడం మా వంతు అయింది అంటూ సన్నిహితులు, స్నేహితులు వెల్లడించారు.

    English summary
    Bahubali fame Rana Daggubati getting married with Miheeka Bajaj. Rana Revealed Miheeka Bajaj as his girl friend goes viral. Suresh Babu says with TOI that, it could even happen sooner. “The wedding will happen this year. We were thinking of having it around December but it could happen even sooner than that too. We will reveal the details once things are finalised.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X