twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబుగా ఉగ్రరూపం, రానా పిచ్చెక్కించాడు.. ఒక్క వీడియోతో 'మహానాయకుడు'పై హైప్!

    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదుల చేశారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం ఫిబ్రవరి 22 శుక్రవారం విడుదల కాబోతుండడంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు.

    కథానాయకుడు ప్రభావం

    కథానాయకుడు ప్రభావం

    ఎన్టీఆర్ కథానాయకుడు భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచింది. మొదటి భాగంలో సినీరంగ విశేషాలని చూపించిన క్రిష్ ప్రేక్షకులని ఆకట్టుకునే అంశాలు రూపొందించలేకపోయారు. దీనితో కథానాయకుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందింది. బయ్యర్లకు తీవ్రమైన నష్టాలని మిగిల్చింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్ మహానాయకుడుపై కూడా ఆశించిన స్థాయిలో అంచనాలు లేవు. కథ, కథనాలు బావుంటే మాత్రం ఎన్టీఆర్ మహానాయకుడు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

    ట్రైలర్‌తో నిరాశే

    ట్రైలర్‌తో నిరాశే

    ఇటీవల ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచే విధంగా లేదు. కానీ చంద్రబాబుగా నటించిన రానా పాత్ర మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రానా చంద్రబాబు మ్యానరిజమ్స్ తో ఎలా నటించాడు అనే ఆసక్తి ఓ వైపు ఉంటె.. రాజకీయ అంశాల్లో చంద్రబాబు పాత్రని ఎలా చూపించారనే ఉత్కంఠ మరోవైపు. దీనితో ఆ దిశగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది.

    మేకింగ్ వీడియో

    మేకింగ్ వీడియో

    ఎన్టీఆర్ మహానాయకుడులో రానా పాత్ర మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో మహానాయకుడుపై ఒక్కసారిగా మంచి హైప్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. చంద్రబాబుగా రానా నటించడానికి చాలా కసరత్తు చేశారు. చంద్రబాబు యంగ్ గా ఉన్నప్పటి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, హావభావాలు ఇలా అన్ని విషయాలని రానా పరిశీలించాడు. అందుకోసం చంద్రబాబుకు సంబంధించిన పాత ఫొటోలన్నింటినీ దగ్గరపెట్టుకుని గమనించాడు.

    రానా ఉగ్రరూపం

    మేకింగ్ వీడియోలో ఓ ఆసక్తికర సన్నివేశాన్ని చూపించారు. సాధారణంగా చంద్రబాబు సహనం కోల్పోయి ప్రవర్తించరు. కానీ ఈ వీడియోలో రానా రూపంలో ఉన్న యాంగ్రీ చంద్రబాబుని చూపించారు. మీరు ఏమన్నా సరే రియాక్ట్ కావద్దు.. ఏమన్నా సరే.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయి డైలాగ్ చెబుతున్నాడు. రైల్వేస్టేషన్ నేపథ్యంలో ఈ సన్నివేశం సాగుతుంది. ఎన్టీఆర్ పక్కనే ఉంటూ చంద్రబాబు అప్పట్లో పార్టీ కార్యక్రమాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు.

    English summary
    Rana Daggubati as Nara Chandrababu Naidu, NTRMahanayakudu making video
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X