twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క ‘రుద్రమ దేవి’ హీరోగా దగ్గుబాటి రాణా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమదేవి' సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి కథానాయకుడుగా దగ్గుబాటి రాణా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆయన ఈచిత్రంలో వీరభద్రుడి పాత్ర పోషిస్తున్నాడు.

    ఈ విషయమై దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ...'కాకతీయుల చరిత్రలో నిడవర్ధ్యపురం యువరాజైన చాళుక్య వీరభద్రుడి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పటి నిడదవోలు అప్పటి నిడవర్ద్యపురం. రాణా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. అతని బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు పర్ ఫెక్ట్ గా సూటవుతుందనే అతన్ని ఎంపిక చేసాం' అన్నారు.

    ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో తీస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్స్ లో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇళయారాజా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు. చెన్నైలోని టెంపుల్ బే రిసార్ట్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఆరు పాటల కంపోజింగ్ పూర్తయింది. ఈ పాటల్ని లండన్‌లోని సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్ చెయ్యడానికి ఇళయరాజాగాను నిర్ణయించారు.

    అనుష్క నటిస్తున్న ఈ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, విఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతా లుల్లా(జోధా అక్బర్ ఫేం), నిర్మాత-కథ-స్క్కీన్ ప్లే-దర్శకత్వం: గుణశేఖర్.

    English summary
    Rana Daggubati as Anushka's upcoming film Rudrama Devi movie hero. He will play the hero role in Rudramadevi as Chalukya Veerabhadrudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X