జనాలు వారి తత్త్వాన్ని మార్చుకోవాలి.. నా మొహం అలా ఉండటంతో.. ‘అరణ్య’పై రానా కామెంట్స్

రానా దగ్గుబాటి ప్రస్తుతం అరణ్య సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డాడు. ప్యాన్ ఇండియన్ చిత్రంగా రాబోతోన్న అరణ్య మూవీ మార్చి 26న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు శేఖర్ కమ్ముల, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రానా మాట్లాడుతూ అరణ్య సినిమాను తనను ఎంతలా మార్చివేసిందో చెప్పుకొచ్చాడు.

 అందుకే పిలిచాను..

అందుకే పిలిచాను..

అరణ్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శేఖర్ కమ్ముల గారిని పిలిచాను. నేను కెమెరా ముందు ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి అని నేర్పిన వ్యక్తి. మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చింది లీడర్ సినిమాతోనే. నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్పేందుకు ఆయన్ను పిలిచాను అని రానా చెప్పుకొచ్చాడు.

ఒక్క వంతైనా..

ఒక్క వంతైనా..

డైలాగ్ రైటర్ సాయి మాధవ్, క్రిష్ కలిసి నన్ను కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో నాకు భాగవత తత్త్వం నేర్పారు. చప్పట్లు అంటే వ్యసనం.. దాని మధ్యలో ఒకడు ఉంటాడు.. వాడికోసం ఈ నాటకం చేయాలి అనే లైన్ ఉంటుంది. ఆ ఒక్కడి కోసమే ఈ సినిమా చేశాను. మా చిన్నాన్నలో ఒక్క వంతైనా సినిమా చేయాలని అనుకున్నాను.. యాక్టింగ్ నేర్చుకున్నాను.. బాగా చేయగలను అని చెప్పేందుకు వెంకటేష్ గారిని పిలిచాను అని రానా అన్నాడు.

రెండేళ్లున్నాను..

రెండేళ్లున్నాను..

అరణ్య మూవీ షూటింగ్ కోసం అడవుల మధ్యలో ఏనుగులకు దగ్గరగా ఉన్నాం. ఆ ఫీలింగ్ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ అనుభవం మీకు అరణ్య ద్వారా తెలుస్తుంది.. మనం అడవి, ఏనుగులపై చేసే అరాచకాన్ని అరణ్య చూపుతుంది. అడవిలో ఓ రెండు రోజులు ఉంటే ప్రశాంతత, మనశ్శాంతి దొరుకుతుందని అంటారు. కానీ నేను రెండేళ్లు అందులోనే ఉన్నాను. దాని వల్ల నేను ఎంతో మారిపోయాను.. ప్రతీ ఒక్కరితో నాకున్న రిలేషన్స్ మారిపోయాయ్ అంటూ రానా తెలిపాడు.

అదే నేర్చుకున్నాను..

అదే నేర్చుకున్నాను..

అరణ్య మూవీ షూటింగ్ చేయడం వల్ల ఏనుగుల నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. మనం ఈ భూమ్మీదే ఉంటాం.. భూమికి మనం ఎంత ఇస్తే.. అది తిరిగి మన ముందు తరాలకు అంత ఇస్తుందని నేర్చుకున్నాను. నేను అన్ని ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు చేశాను.. నా మొహం 10 కమండ్స్ అనే సినిమాలో మోజోస్‌లా ఉంటుందని, ఈ మూవీకి సరిగ్గా సరిపోతుందని దర్శకుడు ప్రభు సోలోమన్ నా దగ్గరికి వచ్చాడు. ఆయన నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం ఎప్పటికీ ఆ రుణాన్ని తీర్చుకోలేను అని రానా పేర్కొన్నాడు.

తత్త్వం మార్చుకోవాలి..

తత్త్వం మార్చుకోవాలి..

నేను ప్రతీ సినిమాను కొత్తగా చేయాలి అని అనుకుంటాను. నా సినిమాతో జనాలు ఎంతో కొంత కొత్తది నేర్చుకోవాలి.. ఇలాంటి సినిమాలు జనాలకు చూపించడం ముఖ్యం. వారికి కొత్త ప్రపంచాన్ని చూపించాలి.. వారి తత్త్వం మార్చుకోవాలి అని రానా అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X