బర్త్ డే స్పెషల్: రానా... చాళుక్య వీరభద్రుడు లుక్ (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీం వర్క్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో నిడవర్ద్యంపురం(ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడుగా, రుద్రమదేవి కథానాయకుడిగా రాణా నటిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 14న రానా పుట్టినరోజు సందర్భంగా చాళుక్య వీరభద్రుడు గెటప్‌లో రాణా ఫస్ట్‌లుక్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ...'రానా బాడీలాంగ్వేజ్‌కి తగిన విధంగా అతని పాత్ర ఉంటుంది. దీన్ని రానా ఓ చాలెంజ్‌గా తీసుకుని ప్రత్యేకమైన శ్రద్ధతో నటిస్తున్నారు. డిజైనర్ నీతా లుల్లా రానా పర్సనాలిటీకి పర్ ఫెక్టుగా సూటయ్యే దుస్తువులు డిజైన్ చేసారు. ఇటీవల అదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం వద్ద చిత్రీకరించిన ఓ పాట, ప్రేమ సన్నివేశాలు బాగా వచ్చాయి' అని తెలిపారు.

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X