‘బహుబలి’లో తన పాత్ర గురించి రాణా అఫీషియల్‌గా..

By Bojja Kumar

హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బహుబలి'లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని తనకు తానుగా అఫీషియల్ గా ప్రకటించుకున్నాడు రాణా. తన ట్విట్టర్ పేజీలో ఈ విషయమై ప్రస్తావిస్తూ......ప్రభాస్ సోదరుడి పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండటంతో రాజమౌళి కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు. ఆసక్తి ఉన్న వారికి తమ సినిమాలో అవకాశం ఇస్తానని, ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపించాలని కోరాడు.

ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X