రానా దగ్గుబాటి వీరాభిమాని మృతి, బంగ్లాదేశ్‌లో.. నాకిది భయంకరమైన వార్త!
అద్భుతమైన నటన, సినిమా కోసం ఎంతటి సాహసాన్నైనా చేయడం లాంటి లక్షణాలతో దగ్గుబాటి రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలు రానా స్థాయిని మరింతగా పెంచాయి. బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడిగా రానా నటనకు ప్రపంచ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. జపాన్ లాంటి దేశాల్లో కూడా రానాకు అభిమానులు ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం రోజు రానా ఓ చేదు వార్తని ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ వార్తతో రానా తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. రానాని ఇంతగా కలచివేసిన ఆ వార్తకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం!

బంగ్లాదేశ్‌లో వీరాభిమాని మృతి
ముందుగా చెప్పుకునట్లుగానే బాహుబలి చిత్రంతో రానాకు దేశ విదేశాల్లో అభిమానులు ఏర్పడ్డారు. బంగ్లాదేశ్ లో కూడా రానాని అమితంగా అభిమానించే వారు ఉన్నారంటే ఆశ్చర్యం అవసరం లేదు. మంగళవారం రోజు బంగ్లాదేశ్ కు చెందిన రానా వీరాభిమాని ఒకరు మృతి చెందారు. ఆమె పేరు అనామిక ఇస్లాం. ఆమెకు రానా అంటే ఎనలేని అభిమానం. కారణాలు తెలియవు కానీ యువతిగా ఉన్నప్పుడే ఆమె మరణించడం విచారకరం.

భయంకరమైన వార్త
అభిమాని మరణించిన విషయాన్ని అతడి రానా ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. బంగ్లాదేశ్ కు చెందిన రానా అభిమాని అనామిక ఇస్లాం ఇక లేరు అంటూ అతడి ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. దీనిపై రానా స్పందించాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.. ఇది నిజంగానే భయంకరమైన వార్త. ఆమె కుటుంబ సభ్యులందరికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని రానా ట్వీట్ చేశాడు.

అభిమానులపై ప్రేమ
విషయం, చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా తన అభిమాని మరణించారనే వార్త తెలియగానే రానా స్పందించడం అభినందించదగ్గ విషయం అని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. రానా నిజాయితీకి, అభిమానులపై అతడి ప్రేమకు ఇది నిదర్శనం అని అంటున్నారు. రానా ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నేను రాజు నేను మంత్రి తర్వాత రానా పూర్తి స్థాయిలో తెలుగు చిత్రంలో నటించలేదు. ఈ ఏడాది విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో చంద్రబాబు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ప్రయోగాత్మక చిత్రానికి
ఇదిలా ఉండగా రానా త్వరలో ఓ ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. వేణు ఊడుగుల దర్శత్వంలో విరాటపర్వం 1992 అనే చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో రూపొందనుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది. టబు, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











