twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ పెళ్లి గురించి చర్చ.. రాజమౌళి జోస్యం చెప్పాడు!

    |

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివాహం గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఆ మధ్య ప్రభాస్ వివాహం గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరకు అనుష్క, ప్రభాస్ పెళ్ళికి రెడీ అవుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలని అనుష్క, ప్రభాస్ తీవ్రంగా ఖండించారు. అయినా కూడా ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ప్రభాస్, రాజమౌళి, రానా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియాలో తెలియజేశారు.

     బాహుబలిని హిందీలో

    బాహుబలిని హిందీలో

    రాజమౌళి దర్శత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రాన్ని బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హిందీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బాహుబలిగా, రానా బల్లాల దేవుడిగా నటించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంతో రాజమౌళి ఖ్యాతి దశదిశలా వ్యాపించడమే కాక ప్రభాస్, రానా క్రేజీ హీరోలుగా మారిపోయారు.

    కాఫీ విత్ కరణ్

    కాఫీ విత్ కరణ్

    ఇటీవల రాజమౌళి, రానా, ప్రభాస్ ముగ్గురూ కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ షో ఇంకా ప్రసారం కాలేదు. కానీ ఆసక్తికరమైన విషయాలు లీక్ అవుతున్నారు. రాజమౌళి, ప్రభాస్, రానా కలసి కరణ్ జోహార్ తో చాలా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రసారం కానున్న ఈ షాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ముగ్గురితో కలసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ నేను గర్వించే కప్ ఆఫ్ కాఫీ.. టీం బాహుబలి అని కరణ్ జోహార్ పోస్ట్ చేశారు.

    ప్రభాస్ పెళ్లి గురించి చర్చ

    ప్రభాస్ పెళ్లి గురించి చర్చ

    ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నీ పెళ్లి ఎప్పుడు అని ప్రభాస్ ని ప్రశ్నించగా.. రాజమౌళి మధ్యలో కల్పించుకుని జోస్యం చెప్పినట్లు సమాచారం. ప్రభాస్ కంటే ముందుగా రానా పెళ్లి అవుతుందని రాజమౌళి వ్యాఖ్యానించారట. ఇలా లీక్ అవుతున్న అంశాలు ఈ ఎపిసోడ్ పై ఆసక్తి పెరుగుతున్నాయి. నాకు చాలా బద్ధకం..అదే నా బలహీనత అని ప్రభాస్ చెప్పాడట. బాహుబలి ఐదేళ్ల ప్రయాణం గురించి రాజమౌళి ఎన్నో విషయాలు తెలియజేసినట్లు తెలుస్తోంది.

    కరణ్ జోహార్ కన్ను పడిందా

    కరణ్ జోహార్ కన్ను పడిందా

    ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై కూడా కరణ్ జోహార్ కన్నుపడ్డట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తో కూడా ఓ చిత్రాన్ని చేసేందుకు కరణ్ జోహార్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది.

    English summary
    Koffee With Karan 6: It's Baahubali and Bhallal Dev on the couch as Prabhas and Rana Daggubati arrive. Rana Daggubati finally grace the Koffee With Karan couch along with director SS Rajamouli
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X