బిజీగా మారిన రానా దగ్గుబాటి.. ఆ హీరో బయోపిక్ క్యాన్సిల్ అయినట్లేనా?
దగ్గుబాటి రానా ఒక హీరో కంటే కూడా మంచి టాలెంటె ఉన్న నటుడిగానే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్నాడు. బాహుబలి అనంతరం పూర్తిగా విలన్ రోల్స్ చేయడం లేదు గాని అవసరం అనుకున్న సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం బిజీగా ఉన్న ఆర్టిస్టులలో రానా ఒకరు. ఇక కొత్త ప్రాజెక్టులను ఒకే చేయాలి అంటే ఈ నటుడు ముందుగా చేతిలో ఉన్న ఎదో సినిమాను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో సినిమా షూటింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇక రానా కూడా మరికొన్ని రోజుల్లో బిజీ అవ్వగా తప్పదు. హాథి మేరీ సాతి సినిమాతో పాటు విరాటపర్వం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసమే హిరణ్యకశిప ప్రాజెక్టును కూడా పక్కన పెట్టాల్సి వస్తోంది. ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ కూడా రానా ఇప్పట్లో దొరికేలా లేడని వేరే సినిమాని లైన్ లో పెట్టాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే శోభన్ బాబు బయోపిక్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిజానికి రానా ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్ ఓకే చేయడానికి సిద్ధంగా లేడట. శోభన్ బాబు బయోపిక్ ని కూడా ఇప్పట్లో చేయలేనని నిర్మాతలకు చెప్పినట్లు టాక్ వస్తోంది. ఇక రానా అయ్యప్పనుమ్ కొశీయుమ్ అనే మలయాళ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రూమర్స్ వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ పై కూడా రానా ఇంకా ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదని టాక్. చూస్తుంటే రానా ఈ ఏడాది కొత్త ప్రాజెక్టును ఓకే చేయడం కష్టమే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











