'సింహా' నిర్మాతతో రాణా చిత్రం ప్రారంభం ఎప్పుడంటే..
వరస పరాజయాల్లో ఉన్న బాలకృష్ణకు'సింహా' చిత్రంతో విజయం అందించిన 'యునైటెడ్ మూవీస్' మరో క్రేజీ కాంబినేషన్ కి తెరలేపింది.దగ్గుబాటి రాణా, జెనీలియా జంటగా చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఏప్రిల్ 9న నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోస్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు.'లీడర్ ద్వారా ఆర్టిస్టుగా తానేంటో రాణా నిరూపించుకున్నాడు. 'నేను నా రాక్షసి'తో కమర్షియల్ స్టామినా చూపించబోతున్నాడు. మేం తీయబోయే చిత్రం ఫీల్‌గుడ్ యూత్ లవ్‌స్టోరీగా నిలుస్తుంది' అని నిర్మాత కిరీటి చెప్పారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన ప్రకాష్ తోలేటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రాణా తొలి బాలీవుడ్ చిత్రం 'దమ్ మారో దమ్' ఏప్రిల్ 22న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











