twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో పోటీ.. నాకంత లేదు, వదిలేయండి అంటున్న రానా!

    |

    ఆరడుగుల ఆజానుబాహుడు రానా ప్రత్యేకమైన కథలు, పాత్రలని మాత్రమే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా తానేంటో ఇప్పటికే రానా నిరూపించుకున్నాడు. బాహుబలి, ఘాజి లాంటి చిత్రాల్లో రానా నటన ఎలావుందో చూశాం. ప్రస్తుతం రానా మరిన్ని ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాడు. రానా ఎక్కువగా బహుభాషా చిత్రాలపై దృష్టి పెడుతూ తన మార్కెట్ ని జాతీయవ్యాప్తంగా చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఓ ఆంగ్ల పత్రిక ఆన్లైన్ లో నిర్వహిస్తున్న పోల్ పై రానా స్పందన ఆసక్తికరగా ఉంది.

     ఘనవిజయం దిశగా

    ఘనవిజయం దిశగా

    బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం గల్లీ బాయ్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. జోయా అక్తర్ ఈ చిత్రానికి దర్శకురాలు. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పిస్తోంది. ఈ చిత్రంలో అలియా భట్, రణవీర్ సింగ్ మధ్య ఘాటైన రొమాన్స్ కూడా ఉంది.

    తెలుగులో రీమేక్

    తెలుగులో రీమేక్

    ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గల్లీ బాయ్ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారని, మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ రీమేక్ లో నటించబోతున్నాడనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ రీమేక్ విషయంలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా పేర్లు కూడా వినిపిస్తునట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.

    నాకంత లేదు

    నాకంత లేదు

    సదరు ఆంగ్ల పత్రిక ఆన్లైన్ లో ఓ పోల్ నిర్వహించింది. వీరిలో ఏ హీరో గల్లీ బాయ్ రీమేక్ లో నటించాలని అనుకుంటున్నారు అంటూ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రానా పేర్లతో పోల్ నిర్వహించింది. దీనిపై రానా స్పందిస్తూ.. నాకు అంత నైపుణ్యం లేదు.. నన్ను వదిలేయండి అని రిప్లై ఇచ్చాడు. రానా రిప్లై కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీకు ఎలాంటి పాత్రలో అయినా నటించే సత్తా ఉంది. కానీ మీరు ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    ఎక్కువవుతున్న రీమేక్ చిత్రాలు

    ఎక్కువవుతున్న రీమేక్ చిత్రాలు

    కథలు బావుంటే పరభాషా చిత్రాలని తెలుగులో, తెలుగు చిత్రాలని ఇతర భాషల్లో రీమేక్ చేయడం సాధారణమే. కానీ ఈ ఏడాది మరిన్ని రీమేక్ చిత్రాలు చూడబోతున్నాము. తమిళ హిట్ చిత్రం జిగర్తాండ తెలుగులో వాల్మీకిగా రూపొందుతోంది. 96 చిత్రాన్ని సమంత, శర్వానంద్ తో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. తాజాగా గల్లీ బాయ్ కూడా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Rana daggubati gives clarity on Gully Boy remake
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X