అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌‌ జరిగిందా? నాని ప్రశ్నకు షాకిచ్చిన రానా

టాలీవుడ్ భల్లాళదేవుడు రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారనే విషయం తెలిసిందే. కొద్దికాలంగా మిహికా బజాజ్ అనే బాలీవుడ్ సెలబ్రిటీతో ప్రేమలో ఉన్న రానా తన ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల సోషల్ మీడియా ద్వారా బయటపెట్టి పెళ్లికి ఒప్పుకొన్నదనే విషయాన్ని వెల్లడించారు. దాంతో టాలీవుడ్ ప్రముఖులే కాదు.. సగటు ప్రేక్షకుడు కూడా షాక్ తిన్నారు. ఆ తర్వాత ఎంగేజ్‌మెంట్ వ్యవహారం మీడియాలో గందరగోళంగా మారింది. నానికి ఈ విషయంలో రానా ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

నాని ఉత్సాహం పట్టలేక

నాని ఉత్సాహం పట్టలేక

తాజాగా రానా, మిహికా బజాజ్ కుటుంబాల కలిసి రోకా అనే వేడుకను మే 20న రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమాన్ని ఎంగేజ్‌మెంట్‌గా భావించి మీడియాలో హల్‌చల్ కొనసాగింది. అయితే ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్‌‌మెంట్ ఏమిటనే ప్రశ్న నేచురల్ స్టార్ నానిని వెంటాడింది. ఆసక్తిని ఆపలేక వాట్సప్‌లో.. అబ్బాయి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? అంటూ ప్రశ్నించారు. ఈ వాట్సప్ చాట్‌ను ఇండియాటుడే ప్రచురించడం గమనార్హం.

 నాని ప్రశ్నకు రానా జవాబు

నాని ప్రశ్నకు రానా జవాబు

నాని ప్రశ్నకు సమాధానం రానా ఇస్తూ.. ఎంగేజ్‌మెంట్ కాదు.. జరిగింది రోకా ఫంక్షన్ అని సమాధానం ఇచ్చారు. రోకా అనగానే నాని కళ్లు తేలేసి.. అర్ధం కాకపోయే సరికి గూగుల్‌లో సర్చ్ చేసి తెలుసుకొంటాను అంటూ ఓ గమ్మత్తైన ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. దాంతో మీడియాలో జరిగిన ఎంగేజ్‌మెంట్ హడావిడికి రానా, నాని సంభాషణతో క్లారిటీ వచ్చింది.

 రోకా ఫంక్షన్ తర్వాత ఎంగేజ్‌మెంట్

రోకా ఫంక్షన్ తర్వాత ఎంగేజ్‌మెంట్

మే 20వ తేదీన జరిగిన ఫంక్షన్ ఎంగేజ్‌మెంట్ కాదు అని రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అసలు విషయం తెలియక మీడియాలో ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందని ఫోటోలతో కథనాలు వచ్చాయి. అయితే మే 20న జరిగింది రానా, మిహికా కుటంబాల మధ్య రోకా ఫంక్షన్ అని స్పష్టమైంది. త్వరలోనే ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగే అవకాశం ఉంది.

Recommended Video

Sri Reddy Marriage Followed By Rana And Mihika Bajaj, Sri Reddy comments Viral
రోకా ఫంక్షన్ ఏమిటంటే

రోకా ఫంక్షన్ ఏమిటంటే

ఉత్తరాది సంప్రదాయం ప్రకారం.. రోకా అంటే నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్ వేడుకల గురించి రెండు కుటుంబాలు కలిసి చర్చించుకొనేందుకు కలిసే ఓ వేడుక. ఆ రోజు ఇరు కుటుంబాల మధ్య పరిచయాలు, మనసు విప్పి మాట్లాడుకోవడాలు జరిగిపోతాయి. అందుకే నిశ్చితార్థం ముందు ఇలాంటి వేడుకను జరిపి ఇరు కుటుంబాల మధ్య సఖ్యతను పెంపొందిస్తారు. ఇదే పెళ్లితంతులో రోకా వేడుక విశిష్టత ఇదే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X