twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టించడానికి గడ్డం తీసేశాడు.. న్యూలుక్‌లో రానా అదుర్స్

    బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల్లో కొత్త తరహా గెటప్‌లతో అదరగొట్టిన రానా దగ్గుబాటి మరోసారి న్యూ లుక్‌ ఆకట్టుకొన్నాడు. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న 1945 చిత్రం కోసం మార్చుకొన్న రూప

    By Rajababu
    |

    బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల్లో కొత్త తరహా గెటప్‌లతో అదరగొట్టిన రానా దగ్గుబాటి మరోసారి న్యూ లుక్‌ ఆకట్టుకొన్నాడు. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న 1945 చిత్రం కోసం మార్చుకొన్న రూపురేఖలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ మారాయి. కొత్త గెటప్‌లో రానా అభిమానులను విపరీతంగా ఆకట్టుకొంటున్నారు.

    Recommended Video

    Filmibeat Top Ten Stories ఫిల్మిబీట్ టాప్ టెన్ స్టోరీస్..
    స్వాతంత్ర్య ఉద్యమ వీరుడిగా

    స్వాతంత్ర్య ఉద్యమ వీరుడిగా

    1945 అనే టైటిల్‌తో తమిళ, తెలుగు భాషల్లో స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సత్య శివ దర్శకుడు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ నేతృత్వంలో నడిచిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో సైనికుడిగా రానా కనిపించనున్నారు.

    1945 కోసం న్యూలుక్‌

    1945 చిత్రం కోసం కొత్త లుక్‌ కోసం ప్రయత్నిస్తున్నాను అని ఇటీవల రానా ట్వీట్ చేశారు. ఈ చిత్రం కోసం గడ్డం మొత్తం తీసేసి సన్నపడిన తన ఫొటోను రానా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ నవంబర్‌లో రానున్నది.

     రానా సరసన రెజీనా

    రానా సరసన రెజీనా

    గత నెల తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్న 1945 చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రానా సరసన అందాల తార రెజీనా కసండ్రా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె చెట్టినార్ యువతిగా నటిస్తున్నారు.

    చీరకట్టులో రెజీనా

    చీరకట్టులో రెజీనా

    రెజీనా కసండ్రా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. చిత్రంలో నేను పూర్తిగా చీరకట్టులోనే కనిపిస్తాను. మేకప్ తక్కువగా ఉంటుంది. చెన్నై, కోచిలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలలో నేను నటించాను అని రెజీనా తెలిపారు.

     యువన్ శంకర్ రాజా సంగీతం

    యువన్ శంకర్ రాజా సంగీతం

    తెలుగులో 1945 టైటిల్‌ను ఖరారు చేయగా, తమిళ వెర్షన్‌లో మదై తిరంథు అనే పేరుతో తెరకెక్కుతున్నది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, సత్య సినిమాటోగ్రఫిని సమకూరుస్తున్నారు. కే ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎన్ రాజరాజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    English summary
    Back-to-back success of Baahubali 2, Ghazi and Nene Raju Nene Mantri, Rana Daggubati is currently shooting for an upcoming bilingual period war drama 1945, being directed by Sathya Siva in Tamil and Telugu. Telugu version is titled 1945, its Tamil version is titled Madai Thiranthu. Yuvan Shankar Raja is composing tunes and Sathya cranks the camera. The film is bankrolled by SN Rajarajan under the banner K Productions..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X