మంచు విష్ణు ఫోన్ చేసి బెదిరించాడు.. వాళ్ల కంటే మోహన్‌బాబుతోనే అంటూ రానా దగ్గుబాటి
మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన మోసగాళ్లు చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటి, చిత్రంలో నటించిన సునీల్ శెట్టితోపాటు ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ...

ఫోన్ చేసి బెదిరించాడు
మోసగాళ్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి ముఖ్య కారణం మంచు విష్ణు. నాకు ఫోన్ చేసి ఈవెంట్‌కు రావాలని బెదిరించాడు. దాంతో రావడం తప్పలేదు. మంచు విష్ణుకు నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. ఆ కారణంగానే తాను ఆ చొరవ తీసుకొన్నాడనే విధంగా రానా మాట్లాడారు.

మోహన్ బాబుతో నా మంచి స్నేహం
ఇక మోహన్‌బాబుతో తనకు గొప్ప అనుబంధం ఉంది. మంచు విష్ణు, మనోజ్ కంటే నాకు ఆయనతో గొప్ప రిలేషన్ ఉంది. ఆ ఇద్దరి కంటే మోహన్‌బాబుతో మంచి స్నేహం ఉంది. ఆ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని రానా అన్నారు.

సునీల్ శెట్టిని చూసి కండలు పెంచా
మోసగాళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావడానికి మరో ప్రధాన కారణం సునీల్ శెట్టి. నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు జిమ్ వెళ్లడానికి కారణం ఆయనే. మోహ్రా సినిమాలో ఆయన కండలు చూసి నేను స్పూర్తి పొందాను. అలాగే నేను ముంబైకి తొలిసారి వెళ్లినప్పుడు సునీల్ శెట్టి డూప్‌ను కలిసి అతడితో ఫోటో దిగాను. సునీల్ శెట్టి అంటే అంత అభిమానం. ఆయన తెలుగులో నటించడం గొప్ప విషయం. ఇక్కడ చాలా సినిమాలు చేయాలి అంటూ రానా తన ప్రేమను వ్యక్తం చేశారు.

నాకు, కాజల్‌కు పెళ్లి జరిగిందలా
కాజల్ అగర్వాల్, నేను కలిసి నటించాం. లాక్‌డౌన్ సమయంలో మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. పెళ్లి చేసుకొన్న కాజల్‌కు నా కంగ్రాట్స్ అంటూ రానా అనగానే.. నవదీప్ కల్పించుకొంటూ లాక్‌డౌన్‌లో రెండు ఘోరాలు జరిగిపోయాయని అన్నారు. అయితే తన పెళ్లి మరో కరోనా వస్తే అప్పుడు చేసుకొంటాను అని రానా పేర్కొన్నారు.

మోహన్‌బాబు పుట్టిన రోజున
ఇక మోసగాళ్లు చిత్రం ఓ ప్రత్యేకమైన రోజున రిలీజ్ అవుతున్నది. మార్చి 19వ తేదీ మోహన్ బాబు పుట్టిన రోజు. కాబట్టి ఆ రోజున అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. ఈ సినిమాను పెద్ద హిట్ చేయండి. ఈ యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ అంటూ రానా తన స్పీచ్‌ను ముగించారు.


Click it and Unblock the Notifications











