»   » కాజల్ రానాల కాంబినేషన్ లో తేజా కొత్త సినిమా..?

కాజల్ రానాల కాంబినేషన్ లో తేజా కొత్త సినిమా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు యూత్ సినిమా అంటే తేజా. నువ్వూనేనూ,జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగారు తేజా.అయితే గత కొంతకాలంగా సరైన విజయాల్లేవు. మొన్నటికి మొన్న వచ్చిన హోరాహోరీ కూడా నిరాశ పరచటం తో స్టార్ హీరోలమీదా, మిగిలిన పెద్ద డైరెక్టర్లమీదా తన అసహనాన్ని బాహాటంగానే బయటపెట్టూకున్నాడు ఈ యాంగ్రీ డైరెక్టర్.

తేజ ఇప్పుడు మరో ప్రయత్నం చేయబోతున్నారు.ఎప్పుడూ తీసే మూస ప్రేమకథాలని పక్కన పెట్టి ఒక మెచ్యూర్డ్ లవ్ స్టొోరీ లో యాక్షన్ మిక్స్ చేసి మళ్ళీ ఒక హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడట.ఈ సారి ఆయన రానా కోసం కథ సిద్ధం చేశారని సమాచారం. రానా కూడా తేజతో పనిచేయడానికి సుముఖంగానే ఉన్నాడట.ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నాకే సినిమాని ఓకే చేశారనితెలుస్తోంది.

Rana Teja

ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గాకూడా కాజల్‌ని ఎంచుకొన్నారట. 'లక్ష్మీ కల్యాణం'తో కాజల్‌ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది తేజనే. ఆ తరవాత ఆయన దర్శకత్వంలో కాజల్‌ నటించలేదు.

ప్రస్తుతం 'బాహుబలి 2', 'ఘూజీ' చిత్రాలతోబిజీగా ఉన్నాడు రానా. అటు కాజల్ కూడా కాస్త బిజీ గానే ఉంది ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం'లో నటిస్తోంది.బాలీవుడ్‌లో కూడా ఓ సినిమా చేస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో త్వరలోనే ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉంది. ఒక కథానాయికగా కాజల్‌ని ఎంచుకొన్నట్టుసమాచారం. ఈ ఇద్దరి ప్రాజెక్ట్ లూ పూర్తయిన వెంటనే తేజ తో సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యేఅవకాశాలున్నాయి.

English summary
Rana To Romance Kajal Aggarwal in Director Teja New Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu