For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రానా దగ్గుబాటికి కిడ్నీ మార్పిడి జరిగిందా? ఈ వార్తల్లో నిజం ఎంత?

|
Rana Daggubati Kidney Transplant Surgery Successful || Filmibeat Telugu

ప్రముఖ తెలుగు నటుడు, బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా రానాకు అమెరికాలోని చికాగో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ప్రస్తుతం సురేష్ బాబు కుటుంబం మొత్తం కూడా అమెరికాలోనే ఉన్నారని, నాగ చైతన్య తల్లి కూడా తన మేనల్లుడిని చూసేందుకు చికాగో వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానాకు కిడ్నీ మార్పిడి జరిగిన విషయం సురేష్ బాబు కుటుంబం, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

నాని మూవీ కోసం నిర్మాతగా రానా.. వాళ్లకు సినిమా చూపిస్తాడట

రానాకు కిడ్నీ దానం చేసిన తల్లి??

రానాకు కిడ్నీ దానం చేసిన తల్లి??

రానాకు అతడి తల్లి లక్ష్మి కిడ్నీ దానం చేసినట్లుగా మీడియాలో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.ఏ తల్లికి అయినా కన్నబిడ్డ క్షేమం కంటే మరేదీ ఎక్కువ కాదు. రానా ప్రాణాలు కాపాడుకోవడం కోసం లక్ష్మి ముందుకు వచ్చినట్లుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

బాహుబలి తర్వాతి నుంచే సమస్య మొదలైంది

బాహుబలి తర్వాతి నుంచే సమస్య మొదలైంది

బాహుబలి సినిమా కోసం రానా ఫిట్ నెస్ కోసం వర్కౌట్లు చేసి భళ్లాలదేవ పాత్ర కోసం భారీగా కండలు పెంచాడు. మరి ఆ వర్కౌట్స్ ఎఫెక్టో? మరో కారణమో తెలియదు కానీ... ఆ సినిమా అనంతరం ఆయనకు కిడ్నీ సంబంధ అనారోగ్యం వచ్చిందని, గత ఏడాది కాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు టాక్.

కిడ్నీ మార్చక తప్పని పరిస్థితి అంటూ..

కిడ్నీ మార్చక తప్పని పరిస్థితి అంటూ..

ఏడాది కాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న రానా... హైదరాబాద్, ముంబైలో చికిత్స పొందారు. మందులతో తగ్గిపోతుందని వైద్యులు మొదట భావించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకుంటే మరింత ప్రమాదమని చెప్పడంతో ఆపరేషన్ తప్పలేదంటూ ప్రచారం జరుగుతోంది.

రెండు నెలలు అమెరికాలోనే...

రెండు నెలలు అమెరికాలోనే...

వైద్యులు నెల రోజుల నుంచి ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచుతూ చికిత్స చేశారని. ప్రస్తుతం రానా విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు నెలల తర్వాత పూర్తిగా కోలుకుని రానా తిరిగి హైదరాబాద్ వస్తారని, వచ్చిన తర్వాత విరాట పర్వంతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
Rana Daggubati Kidney kidney transplant surgery Successful. His mother Lakshmi has donated her one of the Kidneys. Rana will need rest for two months at least.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more